Throat Pain: గొంతు నొప్పికి తక్షణ ఉపశమనం అందించే ఇంటి చిట్కాలు

గొంతు నొప్పి వచ్చినప్పుడు చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది పుక్కిలించడం. పసుపు, ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటితో పుక్కిలించడం గొంతులోని బాక్టీరియాను నాశనం చేసి నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని రోజులో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుందటున్నారు నిపుణులు.

New Update
Throat Pain

Throat Pain

Throat Pain: వాతావరణం మారుతుంటే శరీరం సున్నితంగా స్పందిస్తుంది. ప్రత్యేకంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ఉదయాన్నే గొంతులో గుచ్చినట్లుగా అనిపించడం, మింగడంలో ఇబ్బంది పడటం లేదా మాట్లాడేటప్పుడు నొప్పి కలగడం ఇవన్నీ సాధారణ లక్షణాలే. ఇలాంటి సమయంలో తక్షణ ఉపశమనం కోసం ఇంటి చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. సాధారణంగా మందులు తీసుకునే ముందు సురక్షితమైన ఇంటి నివారణలతో సమస్యను ఎదుర్కోవచ్చు. అలా చేయడం వల్ల దుష్ప్రభావాలు ఉండవు మరియు త్వరగా ఉపశమనం లభిస్తుంది.

గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో..

గొంతు నొప్పి వచ్చినప్పుడు చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది పుక్కిలించడం. పసుపు, ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటితో పుక్కిలించడం గొంతులోని బాక్టీరియాను నాశనం చేసి నొప్పిని తగ్గిస్తుంది. దీన్ని రోజులో కనీసం రెండు సార్లు చేయడం ఉత్తమం. మరోవైపు మెంతి గింజలు కూడా గొంతు మంటను తగ్గించడంలో మంచి ఫలితాలను ఇస్తాయి. మెంతిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల ఇది గొంతుకు రక్షణగా మారుతుంది. కొన్నిసార్లు శరీరంలో పేరుకుపోయిన హానికర పదార్థాలు కూడా గొంతు సమస్యలకు దారితీస్తాయి. అలాంటి పరిస్థితిలో గోరు వెచ్చని నీటిలో తాజా నారింజరసం కలిపి కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసి తాగడం మంచిది. 

ఇది కూడా చదవండి: ఎముకల ఆరోగ్యం కోసం.. 30 ఏళ్ల తర్వాత శ్రద్ధ వహించకపోతే..

ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, గొంతు సమస్యను తగ్గిస్తుంది. ఆహారంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకుంటే గొంతుకు విశ్రాంతి లభిస్తుంది. పండ్లు ఎక్కువగా తినడం వల్ల విటమిన్లు శరీరానికి అందుతాయి. గొంతు వాపును తగ్గించడంలో తమలపాకు కూడా సహాయపడుతుంది. తమలపాకులో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గొంతు సమస్యలను తగ్గిస్తుంది. దాల్చిన చెక్క, మామిడి బెరడును మరిగించి ఆ నీటిని టీగా తాగడం వల్ల కూడా గొంతు నొప్పి తగ్గుతుంది.  వాతావరణం మారే సమయంలో ఇలాంటి సహజ నివారణలు పాటించడం వల్ల గొంతు సమస్యల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. ఇవి ఇంటిలో అందుబాటులో ఉండే పదార్థాలే కావడంతో అవి సులభంగా సాధ్యపడతాయి.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

( Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News )

Advertisment
Advertisment
తాజా కథనాలు