/rtv/media/media_files/2025/07/20/alcohol-2025-07-20-14-44-19.jpg)
Alcohol
ప్రస్తుతం మద్యం తాగడం అనేది చాలా మందికి అలవాటుగా మారింది. కొందరికి అది అలవాటు కాకుండా.. వ్యసనంగా మారి దానిని మానుకోవడం అసాధ్యంగా అనిపించే స్థితికి చేరుకుంటారు. చాలా మంది మద్యం మానేస్తామని నిర్ణయించుకుంటారు కానీ అది అమలు చేయడంలో విఫలమవుతారు. అలాంటి పరిస్థితుల్లో మద్యం మానేయడం వల్ల శరీరానికి ఏమి జరుగుతుందో తెలుసుకోవడం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 30 రోజుల పాటు మద్యం మానేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
Also Read : మహేష్ బాబును ఫిదా చేసిన హిందీ సినిమా .. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్
మద్యం ముట్టుకోకపోతే శరీరంలో ఎంత తేడా..
మద్యం మానేస్తే మొదట శరీరంలో కొన్ని మార్పులు తలెత్తుతాయి. మొదటి కొన్ని రోజులలోనే నిద్రాపరమైన సమస్యలు తగ్గుతాయి. మద్యం కారణంగా నిద్ర విరామం తలెత్తే అవకాశం ఉంటుంది. కానీ మద్యం మానేస్తే నిద్రలో మెరుగుదల కనిపిస్తుంది. దీనితోపాటు శరీర శక్తి స్థాయులు కూడా పెరుగుతాయి. మద్యం మానేయడం వల్ల కాలేయానికి గణనీయమైన లాభం కలుగుతుంది. ఎక్కువకాలం మద్యం సేవిస్తే కాలేయంపై అధిక భారం పడుతుంది. అది సిర్రోసిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.
ఇది కూడా చదవండి: బరువు తగ్గాలని ఖాళీ కడుపుతో ఈ నీరు తాగుతున్నారా..? కలిగే హానికరమైన ప్రభావాలు
మద్యం సేవించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, రక్తనాళాల బిగుసుబాటు వస్తుంది. దీని వలన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కానీ మద్యం మానేస్తే.. మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తల, మెడ, కాలేయం, రొమ్ము క్యాన్సర్లకు మద్యం ఒక కారణంగా మారుతుంది. మద్యం మానేస్తే బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు తగ్గుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది, మానసిక స్పష్టత పెరుగుతుంది. అయితే మొదటి కొన్ని రోజులలో డోపమైన్ స్థాయి తగ్గుతుందని.. దానివల్ల తాత్కాలికంగా విచారం, ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ.. అది క్రమంగా నయమవుతుంది. 30 రోజులు మద్యం మానేయడం ద్వారా శరీరం, మనస్సులో ఎన్నో పాజిటివ్ మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read : CRPF జవాన్‌ను చితకబాదిన శివ భక్తులు.. వీడియో వైరల్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మనిషికి బుల్లెట్ దిగితే.. ఎంత సేపట్లో చనిపోతాడో తెలుసా..?
( Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | alcohol )