/rtv/media/media_files/2025/07/20/vegetables-2025-07-20-18-48-34.jpg)
Vegetables
Vegetables: శ్రావణ మాసం అంటే వర్షాకాలం ప్రారంభం. ఈ కాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటంతో కొన్ని కూరగాయలు త్వరగా పాడవుతాయి. పాడైన కూరగాయలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారతాయి. అనేక రకాల బ్యాక్టీరియా, ఫంగస్‌లు వృద్ధి చెందే పరిస్థితి వర్షాకాలంలో ఏర్పడుతుంది. దీనివల్ల ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కూరగాయల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. లేడీఫింగర్‌ను ఈ కాలంలో తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తేమ వల్ల ఇది త్వరగా జిగటగా మారుతుంది. ముడతలు పడి బూజు పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో వాడితే కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. కావున దీన్ని బాగా కడిగి, వెంటనే వండుకుని తినడం ఉత్తమం.
ఆనారోగ్యానికి గురిచేసే కూరగాయలు:
అలాగే క్యాబేజీ కూడా వర్షాకాలంలో ఎక్కువ ప్రమాదకరంగా మారుతుంది. క్యాబేజీ ఆకుల మధ్య బ్యాక్టీరియా మరియు చిన్న చిన్న కీటకాలు దాచుకుంటాయి. పచ్చిగా క్యాబేజీ తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనిని తినేటప్పుడు శుభ్రంగా కడగడం, వేడి నీటిలో మరిగించడం చేయాలి. పుట్టగొడుగులు కూడా తేమలో త్వరగా పాడవుతాయి. ఇవి ఫంగస్‌కు మంచి ఆధారం కావడంతో ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయవచ్చు. పుట్టగొడుగులను కొనేటప్పుడు వాటి తాజా స్థితిని పరిశీలించాలి. పాడిపోయిన పుట్టగొడుగులు శరీరంలో నొప్పులు, వాంతులు, విరేచనాలను కలిగిస్తాయి. పాలకూర ఆరోగ్యానికి మంచిదే అయినా, వర్షాకాలంలో దీనిని ఆచితూచి తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: జంతువులు అనారోగ్యంగా ఉన్నప్పుడు తమను తాము ఎలా చూసుకుంటాయో తెలుసా..?
నేలలో ఉండే సూక్ష్మజీవులు, కీటకాలు పాలకూరలో చేరే ప్రమాదం ఉంది. శరీరంలోకి బ్యాక్టీరియా చేరితే కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడతాయి. కాలీఫ్లవర్ కూడా వర్షాకాలంలో చాలా సున్నితమైన కూరగాయ. దీనిలో చిన్న పురుగులు చేరి ఉండే అవకాశం ఉంది. కాలీఫ్లవర్‌ను తినేటప్పుడు వేడి నీటిలో ఉడికించి తినడం మంచిది. వంకాయ కూడా ఈ కాలంలో త్వరగా పాడవుతుంది. వంకాయ గింజలు పాడయితే అలెర్జీలు, కడుపు సమస్యలు, చర్మంలో దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువవారికి ఇది హానికరంగా మారుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో కూరగాయల ఎంపికలో జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: గొంతు నొప్పికి తక్షణ ఉపశమనం అందించే ఇంటి చిట్కాలు
( Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News )