Myrobalan: వామ్మో దీనిని తింటే ఇన్ని వ్యాధులు తగ్గుతాయ..? ఎందుకు లేట్..!!

ఆయుర్వేదంలో కరక్కాయకు ఓ ప్రాధాన్యత ఉంది. ఉదయం ఖాళీ కడుపున తీసుకుంటే మంచి ప్రభావం చూపుతుంది. ఇది శరీరంలో కోవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కరక్కాయలోని అనేది సహజ ఔషధం గుణాలు ఆరోగ్యంగా జీవించేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Myrobalan

Myrobalan

ప్రకృతిలో లభించే ఎన్నో ఔషధ గుణగణాలు కలిగిన పదార్థాలలో కరక్కాయ ఒకటి. దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. నిత్యం ఆరోగ్యానికి తోడ్పడే లక్షణాలలో కరక్కాయకు ఓ స్థానం ఉంది. పాతకాలం నుంచీ పెద్దలు దీన్ని అనేక రోగాల నివారణకు ఉపయోగించేవారు. కరక్కాయ పొడిలో కొద్దిగా ఉప్పు కలిపి దంతధావనం చేస్తే చిగుళ్లను గట్టిగా, దంత సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. అలాగే కరక్కాయ నమలడం వలన పిప్పిపన్ను పోటు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి కరక్కాయ ఏ విధంగా ఉపయోగపడుతుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Also Read :  తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. భర్తతో ఫొటోలు వైరల్!

ప్రకృతిచే ప్రసాదించబడిన ఔషధం:

కరక్కాయను భోజనానికి అరగంట ముందు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కరక్కాయ చూర్ణంలో కొంచెం బెల్లం కలిపి అరచెంచా మోతాదుగా రోజుకు రెండు పూటలా తీసుకుంటే రక్తమొలలు తగ్గుతాయి. దీనిలోని ఔషధ గుణాలు శరీరంలోని అనేక సమస్యలకు పరిష్కారంగా నిలుస్తాయి. ఇది పైత్యాన్ని తగ్గించి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. పిల్లల జలుబు, దగ్గు వంటి సమస్యలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. చిన్న కరక్కాయ ముక్క తినటం వల్ల దీర్ఘకాలిక దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 

ఇది కూడా చదవండి: గొంతు నొప్పికి తక్షణ ఉపశమనం అందించే ఇంటి చిట్కాలు

తరచూ కరక్కాయను ఉపయోగించటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. దురదలు, ఎగ్జీమా వంటి సమస్యలకు తగ్గించటంతోపాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో కరక్కాయ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. కరక్కాయ పొడిని ముఖానికి అప్లై చేస్తే మొటిమలు మాయమవుతాయి. ముఖానికి ఒక ప్రకాశాన్ని తీసుకువస్తుంది. ఇది ఒక సహజ స్కిన్ కేర్ మిత్రంలా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది తోడ్పడుతుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల గుండె బలపడుతుంది. వాంతుల సమస్యలున్నప్పుడు కరక్కాయ పొడిని తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. 

Also Read :  షాకింగ్ వీడియో.. ట్రైన్ బ్రిడ్జ్‌పై ఉండగా కూలిపోయిన పునాది - వందలమంది ప్రాణాలు!

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భారత్‌లో గుండె జబ్బులు పెరగటానికి కారణం ఇదే.. హెచ్చరికలు తెలుసుకోండి

(Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News)

Advertisment
Advertisment
తాజా కథనాలు