Milk: రోజూ లీటర్ పాలు తాగితే ప్రమాదమా..నిపుణులు ఏం చెబుతున్నారు?
రోజుకు 200 మిల్లీ లీటర్లు పాలు సరిపోతాయి. అలాగే గుడ్డు ఒక్కటి, మాంసాహారం 75 గ్రాములలోపు మోతాదులో ఉండాలి. వీటి బదులు ఎక్కువగా వృక్ష సంబంధ ఆహారాలు పప్పులు, బీన్స్, మొలకెత్తిన ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే శరీరానికి ప్రొటీన్లు, మినరల్స్, ఫైబర్ అందుతాయి.