/rtv/media/media_files/2025/08/21/drinking-water-2025-08-21-15-21-24.jpg)
Drinking water
నీరు (H₂O) అనేది భూమిపై జీవనానికి ఆధారం. ఇది రంగు, వాసన, రుచి లేని ఒక రసాయన సమ్మేళనం. మన శరీరంలో దాదాపు 60% నీరే ఉంటుంది. నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా, చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది. ఇది జీర్ణక్రియకు, ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. నీరు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు అపారమైనవి. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా అవసరం. ప్రతిరోజూ 3 నుంచి 4 లీటర్లు నీరు తాగితే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, కిడ్నీ సమస్యలను నివారించడం, మెదడు పనితీరుకు, ఏకాగ్రత, తలనొప్పి వంటి సమస్యలను తగ్గుతుంది. అంతేకాకుండా.. బరువు తగ్గాలనుకునే వారికి కూడా నీరు మంచి మిత్రుడు. ఇది శరీరంలోని వ్యర్థాలను తొలగించి.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అయితే నీరు తాగే విషయంలో కొందరికి కొన్ని డౌట్లు ఉంటాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం
మూత్ర విసర్జన వంటి సమస్యలకు..
నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది నీటిని నిలబడి తాగుతున్నారు. ఇది సౌకర్యంగా అనిపించినా దీనివల్ల ఆరోగ్యానికి చాలా నష్టాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు, ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నీరు తాగే సరైన పద్ధతి గురించి వారు కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ఆయుర్వేదం ప్రకారం.. నిలబడి నీరు తాగినప్పుడు అది వేగంగా శరీరంలోకి ప్రవహిస్తుంది. దీనివల్ల మూత్రాశయం, మూత్రపిండాలపై అకస్మాత్తుగా ఒత్తిడి పడుతుంది. ఇది కిడ్నీలలో విషపదార్థాలు పేరుకుపోవడానికి, మూత్ర మార్గంలో అడ్డంకులు ఏర్పడటానికి, తరచుగా మూత్ర విసర్జన వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా.. నీరు శరీరంలో సమానంగా వ్యాపించకపోవడం వల్ల కీళ్లు, మోకాళ్లపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీనికి భిన్నంగా.. కూర్చొని నెమ్మదిగా నీరు తాగడం వల్ల నీరు గొంతు నుంచి కడుపులోకి నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చదవండి: కడుపుకు సంబంధించి ఈ 5 లక్షణాలు కనిపిస్తే డేంజర్.. తప్పక తెలుసుకోండి!
కూర్చొని తాగడం వల్ల కిడ్నీలు నీటిని సమర్థవంతంగా వడపోయగలవు, శరీరంలో నీటి సమతుల్యత కూడా సక్రమంగా ఉంటుంది. ఈ పద్ధతి వల్ల శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లి.. ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా నీటిని బాగా గ్రహిస్తుంది. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కూర్చొని నీరు తాగడం వల్ల హైడ్రేషన్ స్థిరంగా ఉంటుంది. రక్తంలో మినరల్స్ సమతుల్యత దెబ్బతినదు. నిలబడి తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఆహారం తీసుకునే 30 నిమిషాల ముందు, 45 నిమిషాల తర్వాత నీరు తాగడం ఉత్తమమని ఆయుర్వేదం సూచిస్తుంది. భోజనంతోపాటు ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ ఎంజైములు పలుచబడి ఆహారం సరిగా జీర్ణం కాదు. మొత్తానికి నిలబడి నీరు తాగే చిన్న అలవాటు దీర్ఘకాలంలో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనానికి కూర్చొని నెమ్మదిగా నీరు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: దోమలు జంతువులను కూడా కుడతాయి.. మరి వాటికి కూడా డెంగ్యూ, మలేరియా వస్తాయా?