Green Coffee Powder: జుట్టు పెరుగుదలలో మంచి ఫలితాలు కావలా..? ఈ పొడితో ఇలా చేస్తే చాలు..!!

గ్రీన్ కాఫీ పొడిలోని పోషకాలు జుట్టుకు పోషణను అందిస్తాయి. ఇది జుట్టుకు తేమను అందించి.. చుండ్రును తగ్గిస్తుంది. గ్రీన్ కాఫీలో ఉండే కెఫిన్ జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Green Coffee Powder

Green Coffee Powder

కాఫీ గింజల నుంచి తయారైన గ్రీన్ కాఫీ పొడి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ ఇది జుట్టు సంరక్షణకు కూడా ఎంత ఉపయోగపడుతుందో చాలామందికి తెలియదు. సాధారణ కాఫీకి భిన్నంగా.. గ్రీన్ కాఫీ గింజలు కాల్చకుండా ఉంటాయి. అందువల్ల వాటిలోని క్లోరోజెనిక్ ఆమ్లం, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. గ్రీన్ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు జుట్టుకు పోషణను అందిస్తాయి. ఇది జుట్టుకు తేమను అందించి.. చుండ్రును తగ్గిస్తుంది. గ్రీన్ కాఫీలో ఉండే కెఫిన్ జుట్టు కుదుళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు చుండ్రు, దురదను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ కాఫీ పొడి వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

జుట్టు పెరుగుదలలో మంచి ఫలితాలు:

గ్రీన్ కాఫీను ఉపయోగించడం చాలా సులభం. మీరు దీన్ని హెయిర్ మాస్క్, స్కాల్ప్ మసాజ్ కోసం లేదా హెయిర్ టోనర్గా కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం ముందుగా హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవాలి. రెండు చెంచాల గ్రీన్ కాఫీ పొడిని ఒక కప్పు నీటిలో కలిపి 10 నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించి 30 నుంచి 40 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. అంతేకాకుండా ఇంకాస్కాల్ప్ మసాజ్ కూడా చేసిన మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు నీటిలో రెండు చెంచాల గ్రీన్ కాఫీ పొడిని కలిపి స్కాల్ప్‌పై 5-10 నిమిషాలు మసాజ్ చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి.  గ్రీన్ కాఫీ పొడినిలో పెరుగు, కలబంద గుజ్జులో కలిపి 30 నిమిషాలు జుట్టుపై ఉంచి కడగాలి. గ్రీన్ కాఫీ పొడిని కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు పట్టించి 15 నిమిషాలు మసాజ్ చేసి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. 

ఇది కూడా చదవండి: దోమలు జంతువులను కూడా కుడతాయి.. మరి వాటికి కూడా డెంగ్యూ, మలేరియా వస్తాయా?

ఈ విధంగా క్రమం తప్పకుండా 2 నుంచి 3 నెలలు పాటిస్తే జుట్టు పెరుగుదలలో మంచి ఫలితాలు ఉంటాయి. అయితే.. జుట్టు ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ కాఫీ పొడి అనేది వేయించని కాఫీ గింజల నుంచి తయారవుతుంది. ఇది క్లోరోజెనిక్ యాసిడ్‌ను అధికంగా కలిగి ఉంటుంది. ఇది దాని ఆరోగ్య ప్రయోజనాలకు ప్రధాన కారణం. ఇది బరువు తగ్గడానికి, జీవక్రియకు, శరీరంలోని కొవ్వును కరిగించడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా.. ఇది యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉన్నందున ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రింస్తుంది.  క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గ్రీన్ కాఫీ పొడి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిలో దీనిని భాగం చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నీళ్లు నిలబడి తాగాలా? లేక కూర్చొని తాగాలా?.. ఆరోగ్యానికి ఏది మంచిది?

Advertisment
తాజా కథనాలు