/rtv/media/media_files/2025/08/22/thin-is-healthy-2025-08-22-16-55-22.jpg)
సాధారణంగా.. సన్నగా(Thin) ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారని, బొద్దుగా ఉన్నవారు అనారోగ్యంతో బాధపడుతున్నారని చాలామంది భావిస్తారు. అయితే ఆరోగ్యం, ఫిట్‌నెస్ నిపుణులు ఈ అభిప్రాయం సరికాదని చెబుతున్నారు. శరీర బరువు లేదా ఆకారం మాత్రమే ఆరోగ్యాన్ని నిర్ణయించదు. నిజమైన ఆరోగ్యం మన జీవనశైలి(Life Style), ఆహారపు అలవాట్లు(Food Habits), శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సన్నగా కనిపించే చాలామందిలో కండరాల బలం, రోగనిరోధక శక్తి మరియు శక్తి స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిని స్కిన్నీ ఫ్యాట్ అంటారు. ఇందులో బయటకు సన్నగా కనిపించినా.. లోపల శరీరంలో కొవ్వు పేరుకుపోయి, మెటబాలిక్ ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. సన్నగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారా..? నిపుణులు ఏమంటారు..? అనే విషయాలపై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఆరోగ్యంగా ఉన్నామని గుర్తించే విధానం:
నిజమైన ఆరోగ్యం అంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉండాలి, సాధారణ రక్తపోటు, షుగర్ స్థాయిలు, రోజంతా చురుగ్గా ఉండటానికి తగినంత శక్తి, వ్యాధుల బారిన పడకుండా ఉండే బలమైన రోగనిరోధక శక్తి, ఒత్తిడి మరియు ఆందోళనను నియంత్రించగలిగే మానసిక ఆరోగ్యం, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన సమతుల్య ఆహారం. ఈ లక్షణాలు ఉన్నట్లయితే.. బరువు కొద్దిగా ఎక్కువగా ఉన్నా సరే మీరు ఆరోగ్యవంతులుగానే చెబుతారు. అయితే అధిక బరువు పూర్తిగా సురక్షితం కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే బాడీ మాస్ ఇండెక్స్, నడుము-తుంటి నిష్పత్తిపై శ్రద్ధ పెట్టడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: కాళ్లల్లో నొప్పి, గుండెకు సంబంధం ఏంటి?: ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిజమైన ఆరోగ్యం అంటే సమతుల్య శరీరం, మంచి ఆహారం, చురుకైన జీవనశైలి. అతిగా సన్నగా ఉండడం కానీ.. అనియంత్రితంగా లావుగా ఉండడం కానీ మంచిది కాదు. సరైన వ్యాయామం, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారంతో ఎవరైనా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండగలరు. అందుకే.. మరొకరిని చూసి సన్నగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యవంతుడని భావించే ముందు.. నిజమైన ఆరోగ్యం కంటికి కనిపించే బరువుతో కాకుండా.. వారి జీవనశైలితో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:ఇంట్లోనే ఈ చిన్న పరీక్షతో బ్రెయిన్ ట్యూమర్‌ను గుర్తించొచ్చు.. ఎలా చేయాలో తెలుసా?