/rtv/media/media_files/2025/08/22/leg-pain-2025-08-22-15-02-15.jpg)
Leg Pain
పాదాలలో తరచుగా నొప్పి(Leg Pain) వస్తుంటే.. దాన్ని అలసట లేదా సాధారణ నొప్పితో ముడిపెట్టకండి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల ప్రకారం.. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ఒక ముఖ్యమైన ముందస్తు సూచన కావచ్చని అంటున్నారు. కాలి నరాలలో అడ్డుపడటం గుండె నరాలలో అడ్డుపడటం అంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాదాలలో నొప్పి, ముఖ్యంగా నడిచేటప్పుడు వచ్చే నొప్పిని తేలికగా తీసుకోకూడదు. ఇది పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) అనే పరిస్థితికి సంకేతం కావచ్చని చెబుతున్నారు. పాదాల నొప్పిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పాదాల నొప్పి గుండెకు ప్రమాదకరం కావచ్చు..
పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే కాళ్ళలోని ధమనులలో కొవ్వు మరియు కొలెస్ట్రాల్(Cholesterol) పొరలు పేరుకుపోవడం. ఈ పొరను ప్లాక్ అంటారు. ఈ ప్లాక్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రవాహం తగ్గి పాదాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో నొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా ఇది 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. 70 ఏళ్లు పైబడిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. PAD యొక్క ప్రధాన లక్షణం నడుస్తున్నప్పుడు తొడ లేదా పిక్కల్లో నొప్పి రావడం, విశ్రాంతి తీసుకున్నప్పుడు అది తగ్గడం. ఈ పరిస్థితిని క్లాడికేషన్ అంటారు. ఇంకా కాళ్ల వెంట్రుకలు రాలిపోవడం, పుళ్ళు త్వరగా మానకపోవడం, పాదాలు బరువుగా అనిపించడం కూడా ఈ వ్యాధి లక్షణాలే.
ఇది కూడా చదవండి: జుట్టు పెరుగుదలలో మంచి ఫలితాలు కావలా..? ఈ పొడితో ఇలా చేస్తే చాలు..!!
డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మరియు ధూమపానం వంటివి PADకు ప్రధాన కారణాలు. వీటిలో ధూమపానం నరాలకు నేరుగా హాని కలిగించడం వలన అతిపెద్ద ప్రమాద కారకంగా చెబుతారు. పాదాలలో నిరంతరంగా నొప్పి ఉంటే.. డాక్టర్ ankle-brachial index పరీక్ష ద్వారా PADను గుర్తించవచ్చు. నివారణకు.. రోజూ నడవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రవాహం మెరుగుపడి పరిస్థితిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ సమస్య ఉంటే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:ఇంట్లోనే ఈ చిన్న పరీక్షతో బ్రెయిన్ ట్యూమర్‌ను గుర్తించొచ్చు.. ఎలా చేయాలో తెలుసా?