GHMC  : నాగార్జున, వెంకటేష్‌లకు షాక్‌.. స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు

టాలీవుడ్ అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేష్ లకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు.

New Update
FotoJet - 2025-11-21T092947.071

GHMC notices to studios

GHMC  : టాలీవుడ్ అగ్ర హీరోలు నాగార్జున(akkineni-nagarjuna), వెంకటేష్(hero-venkatesh) లకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో(annapurna-studio), రామానాయుడు స్టూడియో(Ramanaidu Studios)లకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిందే అంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు.

Also Read :  ప్రైవేటు వ్యక్తుల లబ్ధి కోసమే  ‘ఫార్ములా- ఈ’ కుట్ర..ఏసీబీ సంచలన ఆరోపణ

GHMC Notices To Nagarjuna and Venkatesh Studios

జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ సర్కిల్ 18 అధికారులు గుర్తించారు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నుల ఎగవేస్తున్నట్లు వెల్లడించారు.  అన్నపూర్ణ స్టూడియో విస్తీర్ణానికి సంబంధించి 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తోంది. అలాగే, రామానాయుడు స్డూడియో విస్తీర్ణం ప్రకారం 1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. కేవలం 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిందే అంటూ నోటీసులు జారీ చేశారు. 

ఈ రెండు సంస్థలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. దీంతో నవంబర్‌ 21న రెండింటికీ నోటీసులు జారీ చేశారు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌  లక్షా 92 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులు చూపిస్తున్నారు. దీనికి 11,52,000 చెల్లించాల్సి ఉండగా, రూ.49వేలు మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నట్లు తెలిపారు

ఇక రామానాయుడు స్టూడియోస్  68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1900 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రూ.2,73,000 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.7,600 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అని హెచ్చరికలు జారీ చేస్తూ జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారుల ఈ రెండు సంస్థలకు నోటీసులు ఇచ్చారు.

Also Read :  తెలంగాణ బాక్సర్ నిఖత్ ఖాతాలో మరో స్వర్ణం

Advertisment
తాజా కథనాలు