EarthQuake: ఇండోనేషియాలో తీవ్ర భూకంపం..!
ఇండోనేషియాలోని సెరామ్ ద్వీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ అందించింది. GFZ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది
ఇండోనేషియాలోని సెరామ్ ద్వీపంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ అందించింది. GFZ ప్రకారం, భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది
అస్సాంలోని నాగావ్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9గా నమోదైంది. భూకంపం ప్రభావం నాగావ్, దాని పరిసర ప్రాంతాలలో కూడా కనిపించింది.తీవ్రత తక్కువగా ఉండటం వల్ల, ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ పరిసరాలను కూడా తాకింది. అఫ్గానిస్థాన్‌కి 121 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది.
దక్షిణ కాలిఫోర్నియాను 5.1 తీవ్రతతో భూకంపం తాకిందని అమెరికా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపారు.ఇది జూలియన్‌కు దక్షిణంగా 2.5 మైళ్లు కేంద్రీకృతమై ఉందని, ఇది అమెరికా మెక్సికో సరిహద్దు ఎనిమిది మైళ్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.
ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్లో నాలుగు భూకంపాలు వచ్చాయి. భారత్‌లో రెండు, మయన్మార్, తజికిస్తాన్లో ఒక్కోటి వచ్చాయి. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు.
పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 1:00 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. షోపియన్, శ్రీ నగర్‌తో సహా భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.
తెలంగాణ రాష్ట్రానికి భూకంపం ప్రమాదం ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలను కొట్టిపారేశారు ఎన్జీఆర్ఐ (NGRI) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శశిధర్. ఈ మేరకు ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడారు.
నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఈ సారి రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతగా నమోదైంది. శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు తలెత్తడంతో ప్రజల పరుగులు తీశారు. మరోవైపు ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కూడా ఇవి తాకినట్లు సమాచారం.