ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం 4 గంటల్లోనే 2 భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5, 4.6 తీవ్రతతో నమోదమయ్యాయి. దీంతో ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించారు. వరుస భూకంపాల వల్ల తీర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. అక్కడి10 ద్వీపాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత సెప్టెంబర్‌లో కూడా ఇండోనేషియాలో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
Also read: టాయిలెట్‌లో ఉండి వర్చువల్ విచారణ.. కోర్టు కీలక ఆదేశం
అమెరికాతో పాటు పలు దేశాల్లో నమోదవుతున్న భూ కంపాలు పెను సంచలనంగా మారుతున్నాయి. అమెరికాతో పాటు అర్జెంటీనా, పెరూ, ఫిలిప్పైన్స్, జపాన్‌లో కూడా వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. జపాన్‌లోని టొకార దీవుల సమూహంలో గత రెండు వారాలుగా భూమి నిరంతరం కంపిస్తూనే ఉంది. జూన్ 21 నుంచి ఇప్పటివరకు అక్కడ ఏకంగా 900 సార్లు భూప్రకంపనలు నమోదవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సగటున గంటకు మూడుసార్లకు పైగా భూమి కంపిస్తుండటంతో అక్కడి స్థానికులు భయంతో వణికిపోతున్నారు.