జపాన్‌లో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. తాజాగా మళ్లీ 2 భూకంపాలు సంభవించాయి. కేవలం 10 నిమిషాల్లోనే 5.5 తీవ్రతతో ఈ భూకంపాలు వచ్చాయి. గత 24 గంటల్లోనే మొత్తం 204 భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది. దీన్నిబట్టి చూస్తే ప్రతి 5 నుంచి 7 నిమిషాలకొకసారి భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో జపాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.
Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం
ఇండోనేషియాలో కూడా ఆదివారం వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం 4 గంటల్లోనే 2 భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5, 4.6 తీవ్రతతో నమోదమయ్యాయి. దీంతో ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించారు. వరుస భూకంపాల వల్ల తీర ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. అక్కడి10 ద్వీపాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇండోనేషియాతో పాటు అండమాన్‌లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ రిపోర్ట్ ప్రకారం.. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు నెపాల్‌లో కూడా ఆదివారం ఉదయం 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.