ap: హమ్మయ్యా ఆంధ్ర రొయ్య అమెరికాకు.. కాకపోతే..!
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారు.
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారు.
ప్రతీకార సుంకాల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎటువంటి రాయితీ ఇవ్వమని తేల్చి చెప్పారు. సెమీ కండెక్టర్లు, చిప్స్ కూడా సుంకాల్లో చేర్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని అంటోంది చైనా. తమపై విధించిన సుంకాలకు ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారీఫ్ లను పెంచింది. అంతకు ముందు యూఎస్ చైనాపై 145 శాతం సుంకాలను పెంచింది.
చైనా ఉత్పత్తులపై సుంకాలను అమెరికా మరోసారి పెంచేసింది. దీనికి సంబంధించి వైట్ హౌస్ క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ దేశంపై టారీఫ్ లను 145 శాతానికి పెంచినట్లు చెప్పింది. ఫెంటనిల్ పై 20 శాతం టారీఫ్ లు అదనం అని చెప్పింది.
అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ట్రంప్ సుంకాలపై ప్రపంచ దేశాలు దండెత్తడానిక రెడీ అయ్యాయి. ఇప్పటికే చైన ఏది ఏమైనా తగ్గేదే లే అంటోంది. ఇప్పుడు యూరోపియ్ యూనియన్ సైతం కీలక ప్రకటన చేసింది. తామూ ప్రతిగా 25శాతం సుంకాలను విధిస్తామని చెబుతోంది.
ట్రంప్ సుంకాల పెంపుతో చైనా కూడా అమెరికా మీద ప్రతీకార పన్నులు విధించింది. అమెరికాపై 84 శాతం టారీఫ్ ఛార్జీలు విధిస్తున్నట్లు చైనా ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి ఈ పన్నుల విధానం అమలులోకి రానుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 104శాతం సుంకాలపై చైనా మండిపడుతోంది. దీనిపై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తీవ్రంగా స్పందించారు. అమెరికాకు తగిన విధంగా బదులిచ్చేందుకు తమ వద్ద అన్ని ఆయుధాలున్నాయని తెలిపారు.
నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ చైైనాపై 104% టారిఫ్లు పెంచడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది.