/rtv/media/media_files/2025/04/12/BmYD1PTvQUIwADVaS8Gx.jpg)
America, China Trade War
అమెరికా -చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పరస్పర సుంకాల పై రెండు దేశాలు బెదిరింపులకు దిగుతున్నప్పటికీ దీని పై ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం అన్నారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడేటప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Anna Lezhneva: పవన్ సతీమణి తలనీలాలు ఇవ్వడంపై వివాదం.. వైరల్ అవుతున్న వీడియోలు!
చైనా ,అమెరికా ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదని బెసెంట్ పేర్కొన్నారు. ఆ దేశంతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో ఒప్పందం కాస్త కష్టమేనని చెప్పుకొచ్చారు. ఎందుకంటే తమ దేశానికి చైనా అతిపెద్ద ఆర్థిక పోటీదారని, సైనిక ప్రత్యర్థి వెల్లడించారు.
అమెరికా చైనా వస్తువుల పై 145 శాతం టారిఫ్ లు విధించగా..డ్రాగన్ కూడా అంతే వేగంగా దూకుడు ప్రదర్శించింది. అగ్రరాజ్యం వస్తువుల పై 125 శాతం సుంకాలు విధించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన మొదలైంది.
ట్రంప్ టారిఫ్ లపై చైనా ప్రతిఘటించడంతో అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే..చైనా దిగుమతి వస్తువుల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. ప్రతిఘటించని దేశాలకు 90 రోజుల విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రంప్ వాణిజ్య యుద్ధం వేళ చైనా ప్రతీకార చర్యలు మొదలు పెట్టింది. రక్షణ, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో ఉపయోగించే అరుదైన ఖనిజాల్లో 90శాతం డ్రాగన్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి.
ఏప్రిల్ రెండు నుంచి చైనా వాటిని నియంత్రణ జాబితాలో చేర్చింది. అమెరికాకు ఒక అరుదైన లోహాలు ఉత్పత్తి చేసే గని ఉంది. అయినా ఆ దేశ వినియోగంలో ఎక్కువ భాగం చైనా నుంచే వస్తున్నాయి. ఈ ఖనిజాల పైనే కాకుండా ఆయస్కాంతాల ఎగుమతిని డ్రాగన్ నిలిపివేసింది.
Also Read: అయ్యప్ప భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఆన్‌లైన్‌లో బంగారు లాకెట్లు.. ఇలా బుక్ చేసుకోండి!
china | america | trump | tariff tax | trump tariff announcement | donald trump tariffs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates