USA: తగ్గేదే ల్యా..సుంకాల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు..ట్రంప్

ప్రతీకార సుంకాల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎటువంటి రాయితీ ఇవ్వమని తేల్చి చెప్పారు. సెమీ కండెక్టర్లు, చిప్స్ కూడా సుంకాల్లో చేర్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. 

New Update
Donald Trump

Donald Trump

ప్రతీకార సుంకాల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మాట్లాడారు. ప్రస్తుతానికి టారీఫ్ లపై 90 రోజుల విరామం ప్రకటించినా...వాటిని మళ్ళీ అమలు కచ్చితంగా చేస్తామని చెప్పారు. ఇందులో ఏ దేశానికీ మినహాయింపు లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా చైనాను క్షమించేదే లేదని అన్నారు. ఆ దేశం మాతో చాలా దారుణంగా వ్యవహరించిందని అన్నారు. మా నుంచి అన్యాయంగా ఇన్నాళ్ళు డబ్బులు వసూలు చేసిన, నాన్‌ మానిటరీ టారిఫ్‌ అడ్డంకులు సృష్టించిన ఏ దేశాన్నీ వదలమని ట్రంప్ స్పష్టం చేశారు. 

Also Read: Bengaluru: 3 రాష్ట్రాలు..700సీసీ కెమెరాలు..దొరికిన బెంగళూరు లైంగికవేధింపుల కేసు నిందితుడు

సెమీ కండక్టర్లు, చిప్స్ మీద కూడా..

రానున్న నేషనల్‌ టారిఫ్‌ ఇన్వెస్టిగేషన్‌లో సెమీకండెక్టర్లు, మొత్తం ఎలక్ట్రానిక్‌ సామగ్రిని కూడా పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. దేశీయంగా ఈ ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందని మాకు ఇప్పుడే తెలిసింది. అందుకే ప్రస్తుతానికి ఈ ఉత్పత్తులపై టారీఫ్ లు వేయడం లేదు. కానీ చైనా చేతిలో బందీలుగా మారకుండా ఉండాలంటే వీటి మీద కూడా టారీఫ్ లను వేయాల్సిందే అని అన్నారు. అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని..భవిష్యత్తులో పన్ను, నియంత్రణల్లో భారీ మొత్తం మినహాయింపులు లభించనున్నాయని చెప్పారు.  తమ దేశాన్ని గతంలో ఎన్నడూ లేనంత పెద్దది, మెరుగైంది, బలమైందిగా మార్చనున్నాం. మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో రాశారు. మరోవైపు రెండు నెలల్లోనే సెమీకండక్టర్‌ టారిఫ్‌ల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా వాణిజ్యమంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌ చెప్పారు. వాటి ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు తరలించేలా వాటిపై దృష్టిపెట్టనున్నామన్నారు. మాకు సెమీకండక్టర్లు, చిప్స్‌, ఫ్లాట్‌ ప్యానల్స్‌ అవసరమని..కానీ వాటి గురించి ఆసియా దేశాలపై ఆధార పడదల్చుకోలేదని లుట్నిక్ చెప్పారు.  

today-latest-news-in-telugu | usa | donald trump tariffs | china

Also Read:  Big Breaking: సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని మళ్ళీ బెదిరింపు..ఈసారి ఇంట్లోకి దూరి మరీ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు