China: మీరు పెంచితే మేము పెంచమా అంటున్న చైనా..125 శాతం సుంకం పెంపు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని అంటోంది చైనా. తమపై విధించిన సుంకాలకు ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారీఫ్ లను పెంచింది.  అంతకు ముందు యూఎస్ చైనాపై 145 శాతం సుంకాలను పెంచింది.

New Update
xi jinping and Trump

xi jinping and Trump

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ మరింత ముదిరిపోతోంది. అమెరికా చైనాపై ప్రతీకార సుంకాలు పెంచుకుంటూ పోతే దానికి ప్రతిగా చైనా కూడా సుంకాలను పెంచుతోంది. తమ ఉత్పత్తులపై వైట్ హౌస్ విధించిన 145 శాతం సుంకాలకు దీటుగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను 84 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. శనివారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ టారీఫ్ ల విషయంలో ప్రస్తుతానికి ఇరు దేశాలూ ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారు. అయితే చైనా ఇది కరెక్ట్ కాదని అంటోంది. చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమేనని చెబుతోంది. కానీ ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదని..ఎంత టారీఫ్ లను పెంచినా పట్టించుకోమని చెప్పింది. ఇంతలా స్థాయికి మించి సుంకాలను పెంచడం ఆర్థికపరంగా తెలివైన నిర్ణయం కాదని అంటోంది చైనా. ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.  

ఒంటరిగా మిగిలిపోతారు..

టారీఫ్ ల అంశంపై చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మొదటిసారి స్పందించారు. తమ దేశంపై ట్రంప్ విధిస్తున్న సుంకాలను ఆయన బెదిరింపు చర్యగా అభివర్ణించారు.  ట్రంప్ వన్నీ ఏకపక్ష నిర్ణయాలని అన్నారు. ఇలానే చేస్తే ప్రపంచం ముందు ఒంటరిగా మిగిలిపోతారని జిన్ పింగ్ అన్నారు. ట్రంప్ చర్యలను వ్యతిరేకించేందుకు ఐరోపా సమాజం తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.  వాణిజ్య యుద్ధంలో విజేతలెవ్వరూ ఉండరని చెప్పారు. చైనాను ఏకాకి చేయాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు కానీ ఈ ప్రయత్నంలో అమెరికానే ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని అన్నారు.  టారీఫ్ ల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 18 వరకు షీ జిన్‌పింగ్‌... వియత్నాం, మలేసియా, కంబోడియా దేశాల్లో పర్యటించనున్నారు. 

 today-latest-news-in-telugu | china | usa | donald trump tariffs 

Also Read: Breaking: వనజీవి రామయ్య కన్నుమూత

Advertisment
తాజా కథనాలు