MLA Harish Rao: బిగ్ బ్రేకింగ్..హరీష్ రావు ఇంట్లో విషాదం..
మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కొద్ది సేపటి క్రితం మృతి చెందారు.వయోభారం, అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు.
మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కొద్ది సేపటి క్రితం మృతి చెందారు.వయోభారం, అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు.
నటుడు ఫిష్ వెంకట్ కొంత సేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే వెంకట్ తుది శ్వాస విడిచారని బంధువులు చెబుతున్నారు.
గత కొంతకాలంగా మయన్మార్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. సైన్యం,ప్రజాస్వామ్య అనుకూల శక్తుల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలో నిరాశ్రయులైన ప్రజలు స్థానికంగా ఒక మఠంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ మఠంపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో 23 మంది మరణించారు.
హైదరాబాద్ నగరం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక ట్రాఫిక్కానిస్టేబుల్ మృతిచెందాడు. పెద్దఅంబర్‌పేట శివారులోని ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డులో సడెన్‌గా ఆపిన టిప్పర్‌ను బైక్ పై వస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఢీకొట్టాడు.
కరెంట్ షాక్‌తో పులి మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆరేళ్లుగా కుమురంభీం ఆసిఫాబాద్ అడవుల్లో తిరుగుతున్న (K-8) ఆడపులి స్మగ్లర్లు అమర్చిన కరెంట్ తీగలకు బలైంది. 15 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఏపీ కడపలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లిమర్రి కొత్తూరు వద్ద వేగంగా వెళ్తున్న కంటైనర్ బైక్ ను ఢీ కొట్టింది. ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మృతులు వేంపల్లికి చెందినమల్లికార్జున, బాలయ్య, మల్లికార్జునగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు యూపీ కార్మికులు దుర్మరణం చెందారు. పవర్ ప్లాంట్‌లో చిమ్నీ అమర్చుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణలో విషాదం నెలకొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం కన్నుమూశారు. 2022లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆమె మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.