Myanmar : మయన్మార్‌లో మఠంపై దాడి..23 మంది మృతి

గత కొంతకాలంగా మయన్మార్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. సైన్యం,ప్రజాస్వామ్య అనుకూల శక్తుల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలో నిరాశ్రయులైన ప్రజలు స్థానికంగా ఒక మఠంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ మఠంపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో 23 మంది మరణించారు.

New Update
Civil war in Myanmar

Civil war in Myanmar

Myanmar :మయన్మార్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. గత కొంతకాలంగా మయన్మార్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. సైన్యం,ప్రజాస్వామ్య అనుకూల శక్తుల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలో నిరాశ్రయులైన సుమారు 200 మంది సామాన్య ప్రజలు స్థానికంగా ఒక మఠంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ మఠంపై శుక్రవారం తెల్లవారుజామున దాడి జరిగింది. దీంతో 23 మంది మరణించారు. మరణించిన వారంతా నిరాశ్రయులైన పౌరులే కావడం గమనార్హం. 

Also Read:Naga Babu Re Entry: 12 ఏళ్ల త‌ర్వాత నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ.. 'జబర్దస్త్' ప్రోమో చూశారా

మయన్మార్‌లోని సాగింగ్ ప్రాంతంలో ఉన్న లింటాలూ గ్రామంలోని ఓ మఠంపై తెల్లవారు జామున ఈ దాడి జరిగింది.ఇవి వైమానిక దాడులుగా తెలుస్తోంది. మయన్మార్ పాలకుల సైనిక జుంటా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ వైమానికి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే జుంటా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సాగింగ్ డిస్ట్రిక్ట్ పీపుల్స్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ హ్లయింగ్ బ్వా , స్థానిక నివాసితుల కథనం ప్రకారం..మయన్మార్ పాలకుల సైనిక జుంటా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కౌన్సిల్ వైమానికి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 23 మంది మృతిచెందారు. ఇందులో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు.

Also Read: Bahubali: శివగామితో బాహుబలి, భల్లాలదేవ.. పదేళ్ల బాహుబలి ముచ్చట్లు! ఫొటోలు చూశారా

మయన్మార్ అవిర్భావం నుంచి ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉంది. 2012లో నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి  మయన్మార్ లో తీవ్ర అంతర్యుద్ధంలో కొనసాగుతోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆ తర్వాత సాయుధ తిరుగుబాటు దేశాన్ని అల్లకల్లోలం చేశాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘర్షణలో పౌరులే ఎక్కువగా నష్టపోతున్నారు.

Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

Also Read: BIG BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు