Road Accident: టిప్పర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

హైదరాబాద్‌ నగరం హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక ట్రాఫిక్‌కానిస్టేబుల్‌ మృతిచెందాడు. పెద్దఅంబర్‌పేట శివారులోని ఔటర్‌ రింగురోడ్డు సర్వీస్‌ రోడ్డులో సడెన్‌గా ఆపిన టిప్పర్‌ను బైక్‌ పై వస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఢీకొట్టాడు.

New Update
Traffic constable death

Traffic constable

Road Accident:  హైదరాబాద్‌ నగరం హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతిచెందాడు. పెద్ద అంబర్‌పేట శివారులోని ఔటర్‌ రింగురోడ్డు సర్వీస్‌ రోడ్డులో సడెన్‌గా ఆపిన టిప్పర్‌ను బైక్‌ పై వస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రమావత్‌ మాన్‌ సింగ్‌ అనే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మరణించాడు. హయత్​నగర్ ​సీఐ నాగరాజు గౌడ్ ​తెలిపిన వివరాల ప్రకారం..రమావత్‌ మాన్‌ సింగ్‌ యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని తొర్రూర్ లోని తన నివాసానికి బయలుదేరాడు.

Also Read :  లక్ అంటే ఇదే.. నక్కతోక తొక్కిన ఫ్యామిలీకి దొరికిన రూ.10లక్షల వజ్రం
 
ఔటర్​రింగ్​రోడ్డు సర్వీస్​రోడ్డులో వస్తుండగా.. పెద్ద అంబర్​పేట వద్దకు రాగానే ముందు వెళ్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ ఎలాంటి ఇండికేటర్​లేకుండా నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో టిప్పర్ వెనుకే వస్తున్న మాన్ సింగ్‌  బైక్​టిప్పర్​వెనకాల బలంగా ఢీకొట్టింది.  దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

USA: ఇరాన్ పై దాడులు.. రెండు వారాల్లో నిర్ణయిస్తారు..వైట్ హౌస్

కాగా విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్​100కు కాల్​చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగరాజు గౌడ్​తెలిపారు.  మృతుడిని యాదగిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మాన్‌సింగ్‌గా గుర్తించారు. కాగా కానిస్టేబుల్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్‌లు.. ఏవి మంచివి?

Advertisment
Advertisment
తాజా కథనాలు