/rtv/media/media_files/2026/01/27/fotojet-17-2026-01-27-15-09-55.jpg)
pregnent women died
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా(sri-satya-sai-district) కదిరి పట్టణంలోని పద్మావతి ఆసుపత్రిలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి, బిడ్డ మృతి చెందారని ఆరోపిస్తూ బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతుల తరపు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్పీ కుంట మండలం(NP Kunta) జౌకల గ్రామానికి చెందిన హరిణి అనే మహిళ వారం క్రితం ప్రసవం కోసం కదిరిలోని పద్మావతి ఆసుపత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున హరిణితో పాటు ఆమె జన్మనిచ్చిన ఆడబిడ్డ కూడా మృతి చెందారు. సరైన సమయంలో వైద్యులు స్పందించకపోవడం వల్లే ఈ అనర్థం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఎన్ పి కుంట మండలం జౌకల గ్రామంకి చెందిన ఓబుల రెడ్డి, హరిణి లకు ఏడాది క్రితం వివాహమైంది. హరిణి ప్రసవం(Pregnent Mother) నిమిత్తం కదిరి పట్టణంలోని పద్మావతి హాస్పిటల్ కి వచ్చింది. ఆసుపత్రిలో చేరి వారం అయినా… డాక్టర్ మారుతి ప్రసాద్ సకాలంలో వైద్యం అందించకపోవడం వైద్యుడి నిర్లక్ష్యంతో తల్లి బిడ్డ మృతి(pregnent-women-died) చెందారని ఆరోపిస్తూ ….హాస్పిటల్ ఎదురుగా జాతీయ రహదారిపై బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే డాక్టర్ మారుతి ప్రసాద్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తల్లి బిడ్డ మృతికి కారణమైన పద్మావతి హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ … బాధితులకు మద్దతుగా ఆందోళనకు దిగారు.
వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు, సీపీఐ మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆసుపత్రి ముందు రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీనివల్ల కదిరిలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, బాధితులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే డాక్టర్ మారుతి ప్రసాద్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తల్లి బిడ్డ మృతికి కారణమైన పద్మావతి హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ … బాధితులకు మద్దతుగా సిపిఐ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు.
Also Read : వరంగల్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణిగా ఉన్న డాక్టర్ మృతి
గతంలోనూ ఇలాగే..
కదిరి పట్టణంలోని పద్మావతి హాస్పిటల్ లో వారం రోజుల క్రితం ప్రసవం కోసం హరిణి హాస్పిటల్లో చేరగా నార్మల్ డెలివరీ చేస్తానంటూ డాక్టర్ నిర్లక్ష్యం చేయడంతో తల్లి బిడ్డ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పద్మావతి హాస్పిటల్ లో తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపణలున్నాయి. గతంలో కదిరి పట్టణం మూర్తిపల్లి కి చెందిన ఓ మహిళ చికిత్స నిమిత్తం రాగా బిడ్డ అబార్షన్ అయిపోయిందని, అప్పట్లో ఆ దంపతులు ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అలాగే కదిరి మండలం వీరేపల్లి పేట కి చెందిన ఓ మహిళ చికిత్స కోసం రాగా బిడ్డ మృతి చెందింది. దీంతో అప్పట్లో ఆందోళన చేయగా గుట్టు చప్పుడు కాకుండా పోలీసు స్టేషన్ లో దుప్పటి పంచాయతీ చేసి కేసు నమోదు కాకుండా తప్పించుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. పద్మావతి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం, ధనదాహానికి మరిన్ని ప్రాణాలు బలికాకుండా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దఅష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతవం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : నేటి నుంచే రాష్ట్రంలో అమలులోకి ఎన్నికల కోడ్.. పుర'పోరుకు షెడ్యులు ప్రకటన!
Follow Us