/rtv/media/media_files/2025/10/28/harish-rao-father-passes-away-2025-10-28-07-34-15.jpg)
Harish Rao's father passes away
MLA Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కొద్ది సేపటి క్రితం మృతి చెందారు.వయోభారం, అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు. సత్యనారాయణ రావు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణంతో తన్నీరు కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు ఆలుముకున్నాయి. హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. హరీష్‌రావుకు పితృవియోగంపై పలువురు బీఆర్‌ఎస్ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
రాజకీయాల్లో హరీష్ రావు విజయానికి, వ్యక్తిత్వానికి తండ్రి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఎంతో ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. సత్యనారాయణ మరణ వార్త వినగానే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, హరీష్ రావు కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆయన ఇంటికి తరలివెళ్లారు. సత్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు, ప్రజాప్రతినిధులు హరీష్ రావు నివాసానికి చేరుకుంటున్నారు. ఈ విషాద సమయంలో హరీష్ రావు కుటుంబానికి ధైర్యం చేకూరాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
Follow Us