Gold Rates: మహిళలకు శుభవార్త అంటే ఇదే.. తగ్గిన పసిడి ధరలు
నేడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
నేడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,240 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.
ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా నిర్మాణం చేపట్టిన నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 10 మందిని రక్షించారు. మరో 12 - 15 మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
సహజీవనం చేసిన యువతిని యువకుడు కొట్టి చంపాడు. పెళ్లిచేసుకోవాలని కోరిన శిల్పా పాండేని అమిత్ తివారి చంపి సూట్‌కేస్‌లో డెడ్‌బాడీ పెట్టి కాల్చేశాడు. పోలీసుల విచారణలో అమిత్ తివారి దొరికిపోయాడు. తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ ఏరియాలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కేరళలో గిరిజన తెగకు చెందని ఓ రాజును కేంద్రం ఆహ్వానించింది. మణ్ణన్ తెగకు చెందిన రాజు రామన్ రాజమణ్ణన్. ఒక గిరిజన రాజును భారత రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
76వ గణతంత్ర వేడుకలను ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలను ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారంటూ ఢిల్లీ సీఎం ఆతిషీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేజ్రీని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. పోలీసులు బీజేపీ కార్యకర్తల్లాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఖోఖో వరల్డ్ కప్ టోర్నీలో భారత మహిళ, పురుషుల జట్లు అదరగొట్టాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా టీమ్స్ ఘన విజయం సాధించాయి. ఖో ఖోలో తొలి ప్రపంచకప్ గెలిచిన జట్లు మనవే కావడం విశేషం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రకటించింది. గర్భిణీలకు రూ.21 వేల ఆర్థిక సాయం, పేదలకు రూ.500 లకే ఎల్పీజీ సిలిండర్లు, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలుకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.