Breaking News : దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 17వ తేదీన స్వల్ప భూప్రంకపనలు వచ్చాయి.  భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా  తెలిపింది. ప్రకంపనలు ఉదయం 5:36 గంటలకు సంభవించాయని వెల్లడించింది.

author-image
By Krishna
New Update
bookampam

దేశ రాజధాని ఢిల్లీలో 2025 ఫిబ్రవరి 17వ తేదీన స్వల్ప భూప్రంకపనలు వచ్చాయి.  భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా  తెలిపింది. ప్రకంపనలు ఉదయం 5:36 గంటలకు సంభవించాయని వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా బలమైన భూ ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమేనని స్పష్టం చేసింది. కొన్ని సెకన్ల పాటు మాత్రమే  భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన జనం ఇళ్లలోంచి  బయటకు పరుగులు తీశారు.  అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 

దేవుడిని ప్రార్థించా :  అతిషి

భూకంపం తర్వాత అందరి బాగుండాలని తాను దేవుడిని ప్రార్థించానని ఢిల్లీ ఆపద్ధర్మ  ముఖ్యమంత్రి అతిషి అన్నారు. ప్రతి ఒక్కరి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నానని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ పోలీసులు కూడా ప్రజల భద్రతను పర్యవేక్షించారు, ఈ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే 112కు డయల్ చేయమని కోరారు. 

Also Read :  TTD: తిరుమలలో ఆ ఐదు రోజులు ఆర్జిత సేవలు రద్దు.. !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు