నేటి ఢిల్లీ భూకంపం.. రాబోయే ప్రళయానికి సంకేతమా..?

ఢిల్లీలో సోమవారం ఉదయం 4.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఢిల్లీలో మరో భూకంపం రాబోతుందని శాస్తవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎర్త్‌కేక్ త్వరలో మరో భారీ భూకంపానికి సూచన అని అనుకుంటున్నారు. 5KM దూరంలోనే భూకంప కేంద్రం ఉండటంలతో పెద్ద శబ్ధం కూడా వచ్చింది.

author-image
By K Mohan
New Update
earthquake delhi

earthquake delhi Photograph: (earthquake delhi)

ప్రమాదం అంచున ఢిల్లీ నగరం. భారత‌్‌కి గుండెలాంటి రాజధాని ఢిల్లీ ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉంది. భారీ భూకంపం ఢిల్లీని భూస్థాపితం చేయనుందనే భయం ప్రస్తుతం వెంటాడుతోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోంది. ఫిబ్రవరి 17 ఉదయం 5 గంటలకు రాజధాని షేక్ అయ్యింది. ఢిల్లీవాసులందరూ భయంతో ఇళ్ల నుంచి భయటకు పరుగులు తీశారు. బూమ్ అని భారీ శబ్ధంతో భూ ఒక్కసారిగా కంపించింది. గురుగ్రామ్, నోయిడా, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రెక్టర్ స్కేల్ మీద 4.0గా భూకంప తీవ్రత నమోదైంది. ధౌలాకాన్ దుర్గాభాయ్ దేశ్ ముఖ్ కాలేజీ సమీపంలో భూఉపరితం నుంచి 5 కి.మీ దూరంలోనే భూకంప కేంద్రం ఉంది.

Also Read: 'చైనాను శుత్రువులా చూడటం ఆపండి'.. శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు

ఈ భూకంప అనుభవాన్ని పెద్ద పెద్ద నాయకులు రాజకీయ నాయకులు కూడా ఎక్స్ ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంట్లో టేబుల్స్, వస్తువులు ఒక్కసారిగా కంపిచడం ప్రారంభించాయి. అదే సమయంలో బూమ్ అని పెద్ద శబ్ధం కూడా వచ్చింది. తక్కువ లోతులో భూకంపాలు పుట్టినప్పుడు ఇలాంటి పెద్ద శబ్ధాలు వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.

బిల్డింగ్‌లో గోడలకు ఉన్న ఫొటోలు, గ్లాస్‌లు కిందపడి పగిలి పోయాయి. టేబుల్‌పై ఉంచిన వస్తువులు కిందపడిపోయాయి. 

Also Read: పాపం పెళ్లి కొడుకు.. బంగారం, రూ.3.5 లక్షలతో పెళ్లి కూతురు జంప్.. ఎక్కడంటే..!?

సిటీ నడిబొడ్డున ఇప్పటివరకు అంత తీవ్రతతో భూప్రకంపనలు ఎప్పుడు రాలే. ఇది దగ్గర్లో మరో భారీ భూకంపానికి సూచనని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. సాధారంగా పెద్ద పెద్ద ఎర్త్‌కేక్ వచ్చే ముందు ఇలాంటి చిన్న భూకంపం వస్తోంది. నేపాల్, జపాన్, ఇండోనేషియా దేశాల్లో కూడా ఇలానే జరుగుతుంది. దీంతో త్వరలోనే ఢిల్లీలో భారీ ఎర్త్‌కేక్ వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 

ఢిల్లీలో ఇప్పటి వరకు సంభవించిన పెద్ద భూకంపం

1960 ఆగస్ట్ 27న సంభవించిన భారీ ఎర్త్‌కేక్ ఢిల్లీని కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో వచ్చిన భూప్రకంపణలకు ప్రజలు వణికిపోయారు. ఇండియాలో సంభవించే భూకంపాలను నాలుగు జోళ్లుగా విభజించారు. అందులో ఢిల్లీ ఫోర్త్ జోన్‌ పరిధిలోకి వస్తోంది. 5 కిలో మీటర్ల కంటే తక్కువ లోతులో ఇప్పటి వరకు ఢిల్లీలో భూకంపం సంభవించలేదు.

ఇండియాలో భూకంపాలు నాలుగు జోన్లుగా..

సెకండ్ జోన్‌లో 4.9 కన్నా తక్కువ తీవ్రతలో భూకంపాలు వచ్చే ప్రాంతం. ఇది ఇండియాలో భూభాగంలో 40శాతం. కర్ణాటక , ద్వీపకల్ప పీఠభూమి ఇందులో ఉన్నాయి. 3వ జోన్ 5 నుంచి 5.9 తీవ్రత కలిగిన భూకంపాలు వచ్చే ప్రాంతం. ఇది దేశ విస్తీర్ణంలో 30.79 శాతం. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలతోపు కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు ఇందులో ఉన్నాయి. ఎర్త్‌కేక్ జోన్ 4లో 6 నుంచి 6.9 తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి. ఇది ఇండియాలో 17.9 శాతం విస్తరించి ఉంది. ఇందులో జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, సిక్కిం, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర పశ్చిమ తీరం, రాజస్థాన్ లు ఉన్నాయి. జోన్ 5లో అత్యధిక తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి. అంటే రిక్టర్ స్కేల్‌పై 7కంటే ఎక్కవ తీవ్రత నమోదౌతుంది. హిమాలయాలు,బిహార్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ అండమాన్ నికోబార్ దీవులున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు