Big BReaking: ఢిల్లీ రైల్వే స్టేషన్‌ లో తొక్కిసలాట..15  మంది మృతి..30 మందికి పైగా గాయాలు!

ఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది మృతి చెందారు. 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

author-image
By Bhavana
New Update
delhistampede

delhistampede

కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది మృతి చెందారు. 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ తొక్కిసలాట ప్లాట్‌ఫాం నంబర్‌ 14,15 లపై జరిగింది.

Also Read: Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు...

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే ఇప్పటి వరకు చనిపోయిన వారి గురించి రైల్వే శాఖ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళా గడువు పొడిగించండి.. అఖిలేష్ యాదవ్ విజ్ఞప్తి!

నాలుగు ప్రత్యేక రైళ్లను...

ఈ దారుణ ఘటన పై మాత్రం అత్యున్నత స్థాయి విచారణకు అధికారులను ఆదేశించింది. తొక్కిసలాటలో మరణాలు జరిగినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌,ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ధ్రువీకరించారు. తొక్కిసలాట నేపథ్యంలో రైల్వే స్టేషన్‌ లో రద్దీని నివారించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

అనూహ్య రద్దీ కారణంగా ఈ తొక్కిసలాట జరిగినట్లు మంత్రి వెల్లడించారు. 14 వ నంబరు ప్లాట్‌ ఫాం పై ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచి ఉండడంతో మహా కుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌ ,భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యం కావడంతో వాటికోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12,13,14 నంబర్‌ ప్లాట్‌ఫాం లపై ఉన్నారు.

దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసినట్లు అధికారులు భావిస్తున్నారు. 

వారాంతం కావడంతో కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ వెళ్ళేందుకు రైల్వేశాఖ 2 ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేసింది. అయినా కూడా రద్దీని తగ్గించలేకపోయింది. ప్రయాగ్ రాజ్ వెళ్ళేందుకు జనాలు తండోపతండాలుగా బయలు దేరుతున్నారు. ఈ క్రమంలోనే న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. 

Also Read: MDNIY: మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్‌కు యోగాతో చెక్.. మోరార్జీ దేశాయ్‌ యోగా కేంద్రంలో వర్క్‌షాప్

Also Read:  Watch Video: మెట్రో రైల్‌ స్టేషన్‌లో గేట్లు దూకిన ప్రయాణికులు.. వీడియో వైరల్‌

Advertisment
తాజా కథనాలు