ఇన్ స్టా మోజులో బలవన్మరణం | Insta Crazy Leads to Death | RTV
ఇన్ స్టా మోజులో పడిబలవన్మరణం| Illegal Affair and Insta Friendship Lead to Death of a woman in Rajanagaram in East Godavari District | RTV
ఇన్ స్టా మోజులో పడిబలవన్మరణం| Illegal Affair and Insta Friendship Lead to Death of a woman in Rajanagaram in East Godavari District | RTV
అమెరికాలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన యువకుడు రూపక్ రెడ్డి ప్రమాదవశాత్తు చనిపోయాడు. స్నేహితులతో కలిసి లేక్ వద్దకు వెళ్లి అక్కడ ఫోటోలు దిగుతున్న క్రమంలో అదుపు తప్పి లేక్ లో పడిపోయాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ స్నేహితులు అతనిని కాపాడలేకపోయారు.
మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ మునిగిపోయింది. ఇక్కడ అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 29మంది మరణించారు.
మయన్మార్ కు చెందిన టిక్‌టాక్ స్టార్ మో స నే (14) జలపాతం పక్కన సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి చనిపోయింది. ఆ బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుని మరణించింది.
హైదరాబాద్ సనత్ నగర్ లోని జెక్ కాలనీలో ఆదివారం బాత్ రూంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడానికి గ్యాస్ గీజర్ లోని కార్బన్ మోనాక్సైడే అని వైద్యుల నిర్థరాణలో తేలింది.మానసిక స్థితి సరిగాలేని కుమారుడుకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.హనుమకొండ మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
మహారాష్ట్రలో వర్షాలు పడిన ప్రాంతంలో రీల్స్ చేస్తుండగా..కాలు జారి లోయలో పడి ఓ ట్రావెల్ ఇన్ ఫ్లూయెన్స్‌ర్ మృతి చెందింది.ఒక లోయ దగ్గర వర్షం పడుతున్న సమయంలో రీల్స్ చేస్తోంది. వానల వల్ల ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారి కాలు జారి 300 అడుగుల లోయలో పడింది.
జనగామ జిల్లా వనపర్తిలో విద్యుత్ అధికారుల సూచనతో స్తంభం ఎక్కి రిపేరు చేస్తున్న ఓ వ్యక్తి షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తేనే స్తంభం నుంచి శవం దించనిస్తామని గ్రామస్తులు 8 గంటల పాటు ఆందోళన చేపట్టారు.