BREAKING: సముద్రంలోనే అగ్నిప్రమాదం.. రిస్క్‌లో 280 మంది ప్రాణాలు

ఇండోనేషియాలో సులవేసి ద్వీపం వద్ద వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు ప్రయాణికులు, సిబ్బందితో కలిపి ఇప్పటి వరకు 284 మందిని రక్షించారు.

New Update
Indonesia

Indonesia

ఇండోనేషియాలో సులవేసి ద్వీపం వద్ద వందల మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఫెర్రీలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా ఇందులో ఓ గర్భిణి కూడా ఉంది.  ‘కేఎం బార్సిలోనా 5’ ఫెర్రీ వందల మందితో తలౌడ్‌ నుంచి ఉత్తర సులవేసి ప్రావిన్సు రాజధాని అయిన మనాడోకు బయలుదేరింది. మధ్యలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

ఒక్కసారిగా మంటలు..

కొన్ని క్షణాల్లోనే ఈ మంటలు భారీగా వ్యాప్తి చెందడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో కొందరు నీటిలోకి దూకారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఫలితం లేకపోయింది. ఐదుగురు మృతి చెందారు. ప్రయాణికులు, సిబ్బందితో కలిపి ఇప్పటి వరకు 284 మందిని రెస్క్యూ బృందాలు రక్షించారు. అయితే ఈ ఫెర్రీలో మొత్తం ఎంత మంది చనిపోయారు? ఎంత మందికి గాయాలు అయ్యాయనే పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్

ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’

Advertisment
Advertisment
తాజా కథనాలు