కొండచరియలు విరిగిపడి.. ముగ్గురు మృతి!

భారీ వర్షాలకు సిక్కింలోని ఛటేన్‌ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో ఆరుగురి ఆచూకీ లభ్యం కావడం లేదు.

New Update
Sikkim

Sikkim

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సిక్కింలోని ఛటేన్‌ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందగా.. మరో ఆరుగురి ఆచూకీ లభ్యం కావడం లేదు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో సిక్కింలో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి.

ఇది కూడా చూడండి: Pineapple: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్‌ను పాడు చేస్తుందా?

1200 మంది పర్యాటకులు..

ఇదిలా ఉండగా.. ఉత్తర సిక్కింలో 1200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. మే 29న మున్షితాంగ్ వద్ద తీస్తా నదిలో ఓ వాహనం జారిపోవడంతో ఎనిమిదిమంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తరలింపు కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా.. కొండచరియలు విరిగిపోవడం వల్ల రహదారులు మూసుకుపోయాయి. ఈ ఘటన సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగించింది.

ఇది కూడా చూడండి: 60 ఏండ్ల కళ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ మోదీ నుంచి రేవంత్ వరకు నేతల ట్వీట్లు వైరల్!

ఇక మేఘాలయలో పది జిల్లాలు వరదలు, కొండచరియల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. త్రిపురలో 10 వేల మందికి పైగా ప్రజలు ఆకస్మిక వరదల వల్ల ఇళ్లు కోల్పోయారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో అస్సాంలో పరిస్థితి మరింత విషమంగా మారింది. రాష్ట్రంలోని 19 జిల్లాల్లోని 764 గ్రామాలు వరదలు కురవగా.. దాదాపు 3.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వరదల కారణంగా ఇప్పటికే పదిమంది ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చూడండి: Viral Video: ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టి.. కాళ్లు పట్టుకున్న మహిళ - వీడియో వైరల్

ఈ రోజు మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య పెరిగింది. అస్సాంలోని దిబ్రూగఢ్, నీమతిఘాట్ వంటి ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలోని మరో ఐదు ప్రధాన నదులు కూడా ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే 10 వేల మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఇది కూడా చూడండి: Rajendra Prasad: నేను అలాగే మాట్లాడుతా.. అది మీ ఖర్మ .. రాజేంద్రప్రసాద్ రియాక్షన్ ఇదే!

Advertisment
తాజా కథనాలు