BREAKING: జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొని రెండు ముక్కలైన బస్సు.. స్పాట్‌లోనే 18 మంది?

జార్ఖండ్‌లోని దియోఘర్‌ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో స్పాట్‌లోనే 18 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 

New Update
JHARKHAND ACCIDENT

JHARKHAND ACCIDENT

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాద ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జార్ఖండ్‌లోని దియోఘర్‌ జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో స్పాట్‌లోనే 18 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 

ఇది కూడా చూడండి:బిచ్చగాళ్లకు బీరు, బిర్యానీ ఇచ్చి.. పోర్న్ చూపించి.. సృష్టి స్పెర్మ్ దందాలో సంచలన విషయాలు!

ట్రక్కు ఢీకొనడంతో..

బైద్యనాథ్ ధామ్ అని పిలిచే దియోఘర్‌కు ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు శివుడిని పూజించడానికి వెళ్తుంటారు. ముఖ్యంగా పవిత్ర గంగా జలాన్ని అర్పించడానికి వెళ్తారు. ఈ సమయంలో యాత్రకులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో రెండు ముక్కలైంది. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి:New York Firing: కాల్పుల్లో పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి

ఇది కూడా చూడండి:Shocking: కుక్క ఫ్యామిలీకి రెసిడెన్సీ సర్టిఫికెట్‌.. ఎక్కడో తెలిస్తే షాక్!

Advertisment
తాజా కథనాలు