BIG BREAKING: చైనాలో ఆకస్మిక వరదలు.. కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి!

చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. గాన్సు ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో 17 మంది మృతి చెందగా, 33 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. భారీ వరదలకు ఇళ్లు నీటమునిగాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

New Update
Floods in China

Floods in China

దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ వరదలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. చైనాలో వాయువ్య గన్సు ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో దాదాపుగా 17 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపుగా 33 మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు. అలాగే గ్వాంగ్జౌలోని దయువాన్ గ్రామంలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. దీనివల్ల ఇళ్లు అన్ని కూడా వీటి కింద శిథిలం అయ్యాయి. మరో 48 గంటల పాటు చైనాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కుండపోత వర్షాలు యుజోంగ్ కౌంటీని అతలాకుతలం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్, ఫోన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Tariff War: దెబ్బకు దెబ్బ..ప్రతీకార సుంకాల తర్వాత బోయింగ్ విమానాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్

స్తంభించినా రవాణా..

చైనాలోని దక్షిణ గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 19వ శతాబ్దం తర్వాత కురిసిన అత్యంత దారుణమైన వర్షాలలో ఇది ఒకటి. భారీ వర్షాలు కురవడంతో ఇళ్లు, చెట్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద ఇళ్లు, కొందరు ఇరుక్కోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వరదల కారణంగా రోడ్లు అన్ని కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోయాయి. దీంతో రవాణా పూర్తిగా స్తంభించింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్వాంగ్జౌలోని బైయున్ విమానాశ్రయం 360 కి పైగా విమానాలను రద్దు చేసింది. 300కి పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. వాటర్ ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోవడంతో ఇన్ఫెక్షన్లు చాలా మందిని ఇబ్బంది పెడుతుందని తెలుస్తోంది.

మరో వారం రోజుల పాటు చైనాలో వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఎన్నో వ్యవసాయ భూములు వరదలతో నిండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ విపత్తు వల్ల సాయంగా అక్కడి ప్రభుత్వం ప్రావిన్సులకు 1 బిలియన్ యువాన్ (USD139 మిలియన్లు) కంటే ఎక్కువ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

Advertisment
తాజా కథనాలు