TG News: మరో యువకుడి ప్రాణం తీసిన బెట్టింగ్ యాప్.. నిజామాబాద్ లో ఘోరం
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా ఆకుల కొండూర్‌లో ఆకాష్ అనే యువకుడు బెట్టింగ్ లో రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో ఆకాష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం...స్పాట్ లో 24 మంది!
మహారాష్ట్రలోని బుల్ధానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముందుగా ఒక బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తరువాత ఈ రెండు వాహనాలకు మరో బస్సు ఢీకొట్టింది.
Telangana Crime: హెల్త్ సూపర్ వైజర్ ని నరికి చంపిన దుండగులు!
మహబూబాబాద్ జిల్లాలో పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. సారథి స్వస్థలం భద్రాచలం. దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు.
Telangana : సిగరెట్ పొగ వచ్చిందని ఒకరు.. గ్రూప్స్‌కు సెలక్ట్ కాలేదని మరోకరు! .
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువకుడు వదిలిన సిగరెట్ పొగ మరో యువకుడి పైకి వెళ్లడంతో తీవ్ర గొడవ జరిగింది. దీంతో సిగరెట్ తాగిన యువకుడిని తొమ్మిది మంది కలిసి కొట్టి చంపేశారు. మరో ఘటనలో గ్రూప్స్ కు సెలెక్ట్ కాలేదని యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
అన్నమయ్య జిల్లాలో విషాదం.. 65 మూగజీవాలు మృతి
మేతకు వెళ్లిన 65 మూగజీవాలు మృతి చెందిన ఘటన అన్నమయ్యలో జరిగింది. శ్రీరాములు అనే వ్యక్తి మేత కోసం గ్రామానికి సమీపంలోని ఓ కొండపైకి మేతకు తీసుకెళ్లాడు. కొండ వెనుక నుంచి ఎవరో నిప్పు పెట్టడంతో ఆ మూగజీవాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి.
Eluru: జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య!
భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ శాంతకుమారి ఏలూరు జిల్లా జైలులో ఆత్మహత్య చేసుకుంది.భర్త బోసుబాబును హత్య చేసిన నేరం కింద పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
AP News: పాపిష్టి సవతి తల్లి... పసిగుడ్డును గోడకేసి కొట్టి చంపి..
గుంటూరులోని ఫిరంగిపురంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సవతి తల్లి లక్ష్మి ఆరేళ్ళ కుమారుడిని గోడకేసి కొట్టి చంపింది. సాగర్ అనే వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో లక్ష్మిని రెండవ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలు అనే కోపంతో లక్ష్మీ వారిని తరచూ హింసిస్తూ ఉండేది.
Ap News: ఏపీలో ఘోరం.. ఉగాది రోజే ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య!
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పండగ రోజు కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. గాంధీ బజార్ లో నివాసముంటున్న గోల్డ్ స్మిత్, కృష్ణాచారి భార్య, ఇద్దరు పిల్లతో సహా ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నారు.