TG Crime: ఖమ్మంలో పుష్ప-3.. స్మగ్లర్లు ఏం చేస్తున్నారంటే?

ఏపీ-ఒడిశా సరిహద్దులలో భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న రూ.4.15 కోట్ల విలువైన 830 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు వారాల్లోనే 2,711 కేజీల గంజాయితోపాటు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Narcotics and marijuana

Narcotics and marijuana

TG Crime: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. తాజాగా పుష్పా మూవీ సీన్లను తలపించేలా వినూత్న పద్ధతుల్లో గంజాయిని రాష్ట్రాల మధ్య తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుబడుతూ, పెద్ద ఎత్తున మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీలు, హైచర్ వాహనాల్లోని క్యాబిన్ల వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛాంబర్లలో గంజాయిని దాచిపెట్టి రవాణా చేస్తూ పోలీసుల ముసుగులో స్మగ్లర్లు రెచ్చిపోయారు. అయితే ఈ ఎత్తుగడలను ముందుగానే పసిగట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పోలీసులు చురుగ్గా పని చేశారు. భారీ దాడులు నిర్వహిస్తూ ముఠాలను ఎట్టకేలకు అరెస్ట్ చేస్తున్నారు.

Also Read :  సుప్రీం కోర్టుకు హీరో మంచు విష్ణు! ఎందుకో తెలుసా

చురుగ్గా పని చేసి..

ఈ నెల 12న చింతూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్న లారీ నుంచి రూ.3.63 కోట్ల విలువైన 727.360 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 17వ తేదీన విజయనగరం నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్న మరో లారీ నుంచి రూ.2.31 కోట్ల విలువైన 463.740 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అదే తరహాలో 24న సీలేరు నుంచి హర్యానాకు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని అడ్డగించి రూ.3.49 కోట్ల విలువైన 690 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఇక 27వ తేదీన అల్లూరి జిల్లా నుంచి ఢిల్లీకి తరలిస్తున్న వాహనం వెనుక భాగంలో దాచిన రూ.4.15 కోట్ల విలువైన 830 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా కేవలం రెండు వారాల్లోనే 2,711 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: పిల్లలకు కరోనా వస్తే.. ఏం చేయాలి? ఏం చేయొద్దు?

గత ఏడాది మొత్తం 112 కేసులు నమోదు చేసి 8,078 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు. ఈ ఏడాది ఐదు నెలలలోనే 3,000 కేజీల మత్తు పదార్థాన్ని పట్టుకున్నారు. స్మగ్లర్లు తమ పద్ధతులను మారుస్తున్నప్పటికీ పోలీసుల పరిశీలనకు అవి గురవుతూనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనంతరం స్మగ్లర్ల ఎత్తుగడలకు పైఎత్తులు వేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్‌లోనూ స్మగ్లింగ్‌కు చెక్ పెట్టేలా పోలీసులు పక్కా వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: క్యాబేజీ, కాలీఫ్లవర్‌ వండే పద్ధతి ఇలా నేర్చుకోండి.. ఎలాంటి సమస్యలు రావు

Alsoi Read :  ఇదిరా పవర్ స్టార్ లుక్ అంటే.. ‘OG’ నుంచి కొత్త వీడియో అదిరిపోయిందెహే

ts-crime | ts-crime-news | latest-news | telugu-news | crime)

Advertisment
Advertisment
తాజా కథనాలు