/rtv/media/media_files/2025/05/26/uCl2m9TlRqrD6qCPS00N.jpg)
electric wire
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో చోటుచేసుకున్న విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఒక కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచేసింది. బొడ్రాయి సెంటర్ వద్ద స్కూటీపై వెళ్తున్న సురేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ప్రమాదానికి గురయ్యాడు. అతని భార్య మౌనిక, మూడేళ్ల కుమారుడు శ్రీమాన్షుతో కలిసి సురేష్ స్కూటీపై ప్రయాణిస్తున్న సమయంలో.. రోడ్డుపైనుగా వెళ్లే విద్యుత్ తీగ ఆకస్మాత్తుగా తెగి వారి మీద పడింది. ఈ ప్రమాదంలో సురేష్‌కు, అతని కుమారుడికి స్వల్ప గాయాలు కావడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Also Read : బంగ్లాదేశ్ అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దు.. పౌరులకు చైనా వార్నింగ్.. ఎందుకంటే?
ప్రాణం తీసిన కరెంట్ తీగలు..
అయితే మౌనికకు తీవ్రమైన కరెంట్ షాక్ తగిలింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని విజయ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆమె గుండె ఆగిపోవడంతో మృతి చెందింది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాలో విషాదంలో ముంచింది. అధికారులు విద్యుత్ శాఖ తక్షణమే స్పందించి.. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏసీ గది నుంచి నేరుగా ఎండలోకి వెళ్తున్నరా..? అయితే మీ ఆరోగ్యానికి..!!
ఇదిలా ఉంటే.. హైదరాబాదులోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. హైదర్‌నగర్ ప్రాంతానికి చెందిన రతన్ లాల్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఐటీసీ సంస్థలో సేల్స్ మాన్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం ప్రకారం అతను కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో మానసికంగా ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంతోనే తాను ఉన్న ఒంటరి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ.. కుటుంబ కలహాలే ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌లో దారుణం.. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం
Also Read : తిన్న తర్వాత ఈ ఐదు సమస్యలు ఉంటే ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థం
( ts-crime | ts-crime-news | latest-news | telugu-news | crime)