Telangana crime: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. డబ్బులు కోసం మహిళను సీసాతో పొడిచి ఆపై..?

సంగారెడ్డి జిల్లాలో రాణెమ్మ(48) అనే ఒంటరి మహిళను దుండగులు డబ్బు కోసం దారుణంగా చంపేశారు. ఆమె ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు తీసుకుని ఆపై ఆమెను సీసాతో పొడిచి దారుణంగా హత్య చేశారు. వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

New Update
annamaianh crime news

crime news

ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. డబ్బు, ఆస్తి కోసం ఇతరులను చంపేస్తున్నారు. ఇలాంటి ఘటన ఇటీవల సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. న్యాల్‌కల్‌ మండలం రుక్మాపూర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రాణెమ్మ(48) అనే ఒంటరి మహిళను దుండగులు డబ్బు కోసం దారుణంగా చంపేశారు. ఆమె ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు తీసుకుని ఆపై ఆమెను సీసాతో పొడిచి దారుణంగా హత్య చేశారు. వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి:Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

కన్న పిల్లల ముందే తల్లి..

ఇదిలా ఉండగా ఇటీవల ఓ తల్లి కన్నపిల్లల కళ్ల ముందే రైలు ప్రమాదంలో మృతి చెందింది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ సమీపంలోని ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆనందంగా స్వగ్రామానికి వెళ్లే ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారింది. అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్‌,శ్వేత (33) దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్న వెంకటేశ్‌ వేసవి సెలవుల సందర్భంగా తన భార్య శ్వేత, ఇద్దరు పిల్లలను స్వగ్రామానికి పంపించాలనుకున్నారు. 

ఇది కూడా చూడండి:BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

ఇందుకోసం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు కోసం ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేశారు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చి భార్యా పిల్లలను డీ3 బోగీలో కూర్చొబెట్టారు. అయితే రైలు బయలుదేరిన కొద్ది సేపటికే శ్వేత సీటుపై ఇతర ప్రయాణికులు వచ్చి ఇది తమదని చెప్పారు. వెంటనే టికెట్‌ను మరోసారి పరిశీలించగా తన బోగీ నంబరు డీ8గా ఉందని తెలుసుకుంది.

ఇది కూడా చూడండి:BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

రైలు రద్దీగా ఉండటంతో బోగీల మధ్య ప్రయాణించడం సాధ్యపడలేదు. దీంతో రైలు ఆగే తదుపరి స్టేషన్‌ అయిన చర్లపల్లిలో దిగింది. పిల్లలు, లగేజీతో కలిసి డీ8 బోగీ వరకు చేరుకోగా అప్పటికే రైలు కదలడం ప్రారంభమైంది. పిల్లలను బోగీలోకి ఎక్కించాక తాను ఎక్కే ప్రయత్నంలో రైలు వేగం పెరిగింది. ఇంతలో ఆమె కింద పడి మృతి చెందింది. 

Advertisment
తాజా కథనాలు