/rtv/media/media_files/2025/04/22/qHDESxg1f9gzzUBfQ65w.jpg)
Death
Uttar Pradesh Crime: ఉత్తరప్రదేశ్‌లో విషాదం జరిగింది. పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. తన ఇంటికి సమీపంలో చెట్టు కింద నిద్రిస్తున్న వ్యక్తిని సిబ్బంది గమనించలేదు. ట్రాక్టర్‌తో తెచ్చిన మట్టిన అక్కడ పోశాడు. దీంతో ఈ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక వివరాల్లోకి వెళ్తే బరేలీ జిల్లాలో సనీల్ కుమార్ ప్రజాపతి(45) అనే వ్యక్తి కూరగాయాల అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.
Also Read: మావోయిస్టు పార్టీకి మరో షాక్.. మోస్ట్ వాంటెడ్ పప్పు ఎన్‌కౌంటర్!
తన పని ముగించుకున్నాక కాసేపు రెస్ట్ తీసుకుందామని తన ఇంటికి దగ్గర్లోని ఓ చెట్టు కింద పడుకున్నాడు. అయితే సునీల్ అక్కడున్న విషయాన్ని పారిశుద్ధ్య సిబ్బంది గమనించలేదు. ఆ ప్రాంతానికి దగ్గర్లోని కాలువలో నుంచి తీసిన మట్టిని సునీల్ పడుకున్న చోటే పోశారు. దీంతో మట్టిలో చిక్కుకున్న సునీల్‌కు ఊపిరాడలేదు. చివరికి స్థానికులు అతడు మట్టిలో చిక్కుకోవడాన్ని గమనించారు.
Also Read: ఆపరేషన్ సింధూర్ లో 200 మందికి పైగా ఉగ్రవాదులు మృతి..న్యూ అప్డేట్స్ అవుట్
వెంటనే అతడిని బయటకి తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ సునీల్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు సునీల్ మృతికి కారణమైన పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. సునీల్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు!
Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం
rtv-news | national-news | crime