Malakpet Gun Firing: మలక్‌పేటలో కాల్పులు కలకలం.. ఒకరు స్పాట్ డెడ్!
HYDలోని మలక్‌పేటలో కాల్పులు కలకలం సృష్టించాయి. నిన్న జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు, మరొకరు గాయపడినట్లు సమాచారం.
HYDలోని మలక్‌పేటలో కాల్పులు కలకలం సృష్టించాయి. నిన్న జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు, మరొకరు గాయపడినట్లు సమాచారం.
అస్సాంలోని గువాహటిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 38 ఏళ్ల మహిళ తన భర్తను హత్య చేసి, ఇంటి ఆవరణలోనే పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. జాయ్మతి నగర్, పండు ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన జూన్ 26న చోటు చేసుకుంది.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయానికి (హర్మందిర్ సాహిబ్) బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్వర్ణ దేవాలయ నిర్వాహక కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం కొత్త రాష్ట్ర సైబర్ సెల్, ఏజెన్సీల సహాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ యువనాయకుడు మారెల్లి అనిల్(35) అనుమానాస్పద మృతిచెందాడు. అతని కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు.
వరంగల్ మెడికవర్‌లో డాక్టర్‌గా వర్క్ చేస్తున్న సృజన్ ఓ ఇన్ఫ్లూయెన్సర్ మోజులో పడి, భార్య ప్రత్యూషకు విడాకులు ఇస్తానని బెదిరించారు. ఆ యువతి మోజులో పడి తనని, పిల్లలను పట్టించుకోవడం లేదని మనస్తాపం చెంది డాక్టర్ ప్రత్యూష్ పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ట్రాక్టర్‌ను కంటైనర్‌లో ఎత్తుకెళ్లారు. జూలై 8న పార్క్ చేసిన ట్రాక్టర్ మరుసటి రోజు కనిపించకపోవడంతో యజమాని ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఆరు రోజులుగా అదృశ్యమైన త్రిపురకు చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహా దేబ్నాథ్ (19) మృతదేహం ఆదివారం యమునా నదిలో లభ్యమైంది. ఆమె హాస్టల్ గదిలో ఆత్మహత్య లేఖ కూడా దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డబ్బులకోసం ఒక మైనర్ బాలున్ని కిడ్నాప్ చేసి హింసించిన ఘటన వరంగల్ జిల్లా హనుమకొండలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా కేసులో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బీహార్‌లో కాల్పుల పరంపర కొనసాగుతోంది. పాట్నా వ్యాపారి గోపాల్ ఖేమ్కాను అగంతకులు కాల్చిచంపిన ఘటన మరువక ముందే మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. జితేందర్ కుమార్ అనే న్యాయవాదిపై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.