Brides Master Plan: భర్తలకు మత్తుమందు పెట్టి..కొత్త వధువుల జంప్‌..ఒకేసారి ఎంతమందో తెలుసా?

కొంతమంది మహిళలు పెళ్లిళ్లు చేసుకొని తమ భర్తతో నమ్మకంగా కొన్ని నెలలు కాపురం చేసి సమయం చూసుకొని డబ్బు, నగలతో జంప్ అవుతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోనూ చోటు చేసుకుంది. అయితే జంప్‌ అయింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మంది మహిళలు కావడం గమనార్హం.

New Update
Husbands are drugged and new brides are jumped.

Husbands are drugged and new brides are jumped.

Brides jump with money :  దేశ వ్యాప్తంగా భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజు ఏదో ఒక చోట ఇలాంటి ఘటన చోటు చేసుకుంటోంది. అయితే కొంతమంది మహిళలు  పెళ్లిళ్లు చేసుకొని తమ భర్తతో నమ్మకంగా కొన్ని నెలలు కాపురం చేసి సమయం చూసుకొని డబ్బు, నగలతో జంప్ అవుతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోనూ చోటు చేసుకుంది. అయితే జంప్‌ అయింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మంది మహిళలు ఇలాగే తమ భర్తలను మోసం చేసి డబ్బు, నగలతో చెక్కేశారు.  అందరినీ విస్మయానికి గురిచేస్తున్న ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. 
 
ఉత్తర భారతదేశంలో కర్వా చౌత్ అనే  పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తమ భర్తల ఆరోగ్యం బాగుండాలని, నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ భార్యలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.  అయితే ఈ పండుగ రోజే కొంతమంది మహిళలు దారుణమైన మోసం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఏకంగా 12 ఇళ్లలో కొత్తగా పెళ్ళైన వధువులు తమ కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన భోజనాన్ని పెట్టి ఇంట్లో నుంచి డబ్బు, నగలతో జంప్ అయ్యారు. ముందుగా వారు పండుగ రోజు అందరితో కలిసి ఇంట్లో గోరింటాకు పెట్టుకొని ఎంతో సందడి చేశారు. అందరితో నమ్మకంగా ఉంటూ ఇంట్లో దేవతలకు పూజలు కూడా చేశారు. రోజంతా ఉపవాసం ఉన్నారు. తమ భర్తలకు హారతి ఇచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్లు అందరిని నమ్మించారు. కానీ, మనసులో మాత్రం భోజన సమయం ఎప్పుడెప్పుడు అవుతుందా? అంటూ ఆలోచిస్తూ పన్నాగాలు పన్నారు. రాత్రి భోజన సమయం కాగానే అందరికీ అన్నంలో మత్తుమందు కలిపారు. ఉపవాసం ముగించిన తర్వాత ఆ అన్నాన్ని అందరికీ వడ్డించారు. వారంతా స్పృహ కోల్పోగానే ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు, ఫోన్లు అన్ని ఒక బ్యాగులో సర్దుకొని అక్కడినుంచి పరారయ్యారు.

మత్తు మూలంగా  స్పృహ కోల్పోయిన వారందరికీ ఉదయం మెలకువవచ్చింది. అయితే వధువులు కనిపించకపోవడం, ఇల్లంతా చిందర వందరగా ఉండటం గమనించి షాక్ అయ్యారు. ఏం జరిగిందో అర్ధం కాక ఇంట్లో వాళ్ళందరినీ నిద్రలేపారు. ఇంట్లోని లాకర్లు తెరిచి చూడగా ఖాళీగా ఉండటం చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇలాంటి ఘటన తమ కుటుంబంలోనే జరిగిందని ఇంట్లో వారు అనుకుంటుండగా.. ఒక్కొక్కటిగా 12  ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మా ఇంట్లో కూడా ఇలాగే జరిగింది అంటూ అన్ని కుటుంబాలు లబోదిబో మంటూ ఏడ్వటం మొదలు పెట్టారు.

12 కుటుంబాల నుంచి మొత్తంగా రూ.30 లక్షలకు పైగా డబ్బు, నగలు అపహరించుకుపోయినట్లు వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకేసారి ఇలా 12 ఇళ్లల్లో ఇలాంటి ఘటన జరగడంతో పోలీసులు ఆశ్ఛర్యానికి గురయ్యారు. ఇందులో ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ దాగివుందని అనుమానం వ్యక్తం చేయడంతో పాటు.. ఆ దిశగా విచారణ చేపట్టారు. వధువులు డబ్బు, నగలతో పరారవ్వడంతో దర్యాప్తులో స్పీడు పెంచారు. మరింత సమాచారం రాబట్టేందుకు అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పెళ్లిళ్లు చేసిన ఏజెంట్ల ఫోటోలు, పత్రాలను సేకరించి.. ఖి'లేడి'లను పట్టుకోవడానికి బిహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

కాగా పక్కా ప్లాన్ ప్రకారం ఇది ఓ ముఠా చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నరు. ఈ దోపిడీ వెనక బ్రోకర్లు కీలక పాత్ర పోషించారని అనుకుంటున్నారు. కొందరు దుండగులు ముఠాగా మారి, అమ్మాయిలను డబ్బున్న అబ్బాయిలతో పెళ్లి చేసి అనువైన సమయం చూసుకొని డబ్బు, నగలతో ఉడాయించాలని ముందే ప్లాన్ చేసుకుని ఈ మోసాలు చేస్తున్నట్లు తెలిపారు. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి.. ఒక్కో పెళ్లికి రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తారని వివరించారు. పెళ్లిళ్లు చేసుకున్న కొద్ది రోజుల్లోనే తమ భర్త, అత్తమామల వద్ద నమ్మకంగా ఉంటూ వారితో మంచివారిగా నటిస్తారని చెప్పారు. కొందరు గుడికి వెళ్లడం, మరికొందరు పనుల్లో సహాయం చేయడం వంటివి చేస్తూ ఎలాంటి అనుమానం రాకుండా తమ మోసాన్ని సాఫీగా చేసుకుంటారని వివరించారు. కొత్తగా పెళ్ళైన బాధితుడు లబోదిబోమంటున్నాడు. తమ పెళ్లి జరిగి 10 రోజులే అయిందని.. కర్వా చౌత్ పండగ రోజు తన భార్య ఎంతో ప్రేమతో పూజ చేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పొద్దున్న లేచే సరికి ఇల్లంతా లూటీ చేసిందని కన్నీళ్లు పెట్టుకుంటూ బోరుమన్నాడు. ఈ విషయమై త్వరలోనే నిందితులను పట్టుకుని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Telangana Rising Vision-2047 : రాష్ట్రంలో మరో సర్వే!.. తెలంగాణలో మరో సర్వే...తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 పేరిట ప్రారంభం

Advertisment
తాజా కథనాలు