Crime news: అక్రమ సంబంధానికి కడుపులో బిడ్డతోపాటు ఇద్దరు బలి

ఢిల్లీలో వివాహేతర సంబంధం ఇద్దరితోపాటు కడుపులో బిడ్డని బలితీసుకుంది. సహజీవనం చేసిన వివాహిత అతడిని వదిలేసి తిరిగి భర్త దగ్గరకి పోయిందని ఆమెపై పగ పెంచుకున్నాడు ప్రియుడు. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేయగా, భార్యను కాపాడుకునే క్రమంలో భర్త అతడిని చంపేశాడు.

New Update
illicit relationship in Delhi

దేశ రాజధాని ఢిల్లీలో వివాహేతర సంబంధం ఇద్దరితోపాటు కడుపులోని బిడ్డ ప్రాణాల్ని బలితీసుకుంది. సహజీవనం చేసిన వివాహిత అతడిని వదిలేసి తిరిగి భర్త దగ్గరకి పోయిందని ఆమెపై పగ పెంచుకున్నాడు. ప్రియుడు ఆమెను అత్యంత దారుణంగా హత్య చేయగా, భార్యను కాపాడుకునే క్రమంలో భర్త అతడిని చంపేశాడు. ఈ క్రమంలో ఆ మహిళ గర్భిణీ.. దీంతో ఆమె కడుపులో బిడ్డ కూడా అక్రమ సంబంధానికి బలైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీలోని రామ్ నగర్ ప్రాంతానికి చెందిన షాలిని (22), ఆకాశ్ (23) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో షాలిని కొన్నాళ్లపాటు స్థానిక నేరస్థుడు ఆషు అలియాస్ శైలేంద్ర (34)తో సహజీవనం చేసింది. అయితే, ఇటీవల ఆమె తిరిగి భర్త ఆకాశ్ వద్దకు వెళ్లి కలిసి ఉంటుంది. ఈ క్రమంలో షాలిని గర్భం దాల్చింది. తనను కాదని భర్త దగ్గరకు వెళ్లిన షాలినిపై శైలేంద్ర పగ పెంచుకున్నాడు. అంతేకాక, కడుపులోని బిడ్డకు తానే తండ్రినని భావించాడు. శనివారం రాత్రి షాలిని, ఆకాశ్ ఇ-రిక్షాలో ఆమె తల్లిని కలిసేందుకు వెళ్తుండగా, శైలేంద్ర అకస్మాత్తుగా వారిపై దాడి చేశాడు. ముందుగా ఆకాశ్ (భర్త)పై కత్తితో దాడి చేయబోగా, అతను తప్పించుకున్నాడు. వెంటనే ఆటోలో కూర్చున్న షాలినిపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు.

భార్యను రక్షించేందుకు ప్రయత్నించిన ఆకాశ్ కూడా గాయపడ్డాడు. అయితే, ధైర్యం చేసి శైలేంద్ర చేతిలోని కత్తిని లాక్కుని, అదే కత్తితో అతడిని పొడిచాడు. ఈ ఘర్షణలో షాలిని, శైలేంద్ర ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆకాశ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. షాలిని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది.

Advertisment
తాజా కథనాలు