/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
Crime
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తిలో దారుణం చోటుచేసుకుంది. శనివారం రాత్రిపూట వాటర్ ట్యాంక్ కూలి తల్లీకొడుకు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ కుటుంబ సభ్యులు ఆదివారం హోటల్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ రేకుల షెడ్డు హోటల్‌పై వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి అక్కడే బస చేశారు.
Also Read: దీపావళి పండగను క్రిస్మస్ లాగా చేసుకోండి.. అఖిలేష్ సంచలన కామెంట్స్!
అయితే ఆ రేకులపై బరువు ఎక్కువ కావడం వల్ల వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో తల్లి నాగమణ, కొడుకు వంశీకృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: ఇస్రోకు చంద్రయాన్-2 నుంచి కీలక సమాచారం.. చంద్రుడిపై సూర్యుడి ప్రభావం..!
ఇదిలాఉండగా మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. చాంద్‌శైలి ఘాట్ వద్ద యాత్రికులతో వెళ్తున్న ఓ పికప్ ట్రక్ కంట్రోల్ తప్పి లోయలో పడిపోయింది. ఈ విషాద ఘటనలో 8 మంది ప్రయాణీకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 18 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. ధడ్గావ్ తాలూకాలోని అస్లి ప్రాంతం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Also Read: మేము దాడి చేయకపోతే..25వేల మంది చనిపోయేవారు..జలాంతర్గామి దాడిపై ట్రంప్ సమర్ధన