Habsiguda: హబ్సిగూడలో తగలబడుతున్న కార్.. డ్రైవర్‌కు ఏమైందంటే?
హబ్సిగూడలో భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ కారును నిలిపివేసి బయటకు వచ్చేయడంతో ప్రమాదం తప్పింది. కారు ఉప్పల్ నుంచి తార్నాక వైపు వెళ్తుండగా హబ్సిగూడ చౌరస్తాకు సమీపంలో ఇది జరిగింది.