/rtv/media/media_files/2025/05/28/Gj6L8otzs2d6mZqx5JKl.jpg)
Heart Attack
Crime News: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని జత్కేడీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఒక్క కుటుంబానికే కాకుండా చూసిన ప్రతీ ఒక్కరిని కలచివేసింది. 51 ఏళ్ల రిషిరాజ్ భట్నాగర్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి అనూహ్యంగా జరిగిన ఓ ఘటన ఆ కుటుంబాన్ని దుఃఖంలో ముంచింది. ఆ రాత్రి రిషిరాజ్ తన కుమారుడిని వెతుక్కుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చాడు.
Also Read : BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే
భయంతో గుండెపోటు..
కొద్ది సేపటిలోనే పిల్లాడు కనిపించడంతో అతనితో ఇంటికి వెళ్లమని చెప్పాడు. ఆ ఎనిమిదేళ్ల బాలుడు లిఫ్ట్ ఎక్కాడు. అయితే అదే సమయంలో అపార్ట్‌మెంట్‌లో పవర్ కట్ అయింది. విద్యుత్ లేకపోవడంతో లిఫ్ట్ నిలిచిపోయింది. తన బిడ్డ అందులో ఇరుక్కుపోయాడని గ్రహించిన రిషిరాజ్ తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. చిన్నారికి ఏదైనా జరిగిపోతుందన్న భయం అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ కలవరంలోనే అతడు గుండెపోటుకు గురయ్యాడు. అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే స్పందించి రిషిరాజ్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు విడిచినట్టు వైద్యులు చెప్పారు.
ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే..7 ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. గుండెపోటుతోనే ఆయన మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇదంతా జరిగి ముగిసేలోపే.. సుమారు మూడు నిమిషాల్లోనే విద్యుత్ తిరిగి వచ్చింది. దీంతో ఆ చిన్నారి ఎలివేటర్ నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. కానీ అప్పటికే ఆ కుటుంబాన్ని కలవరపెట్టిన విషాదం చోటుచేసుకుంది. తండ్రి ప్రేమను వివరించేందుకు మాటలు చాలవు. కాని ఈ సంఘటన ఆ ప్రేమ ఎంత గొప్పదో మరోసారి రుజువు చేసింది. తాను ఏమీ చేయలేనన్న బాధ, పిల్లాడి క్షేమంపై ఉన్న ఆందోళన రిషిరాజ్ ప్రాణాలు తీసింది. బిడ్డ క్షేమంగా బయటపడినా, తండ్రి మృత్యువు ఆ కుటుంబాన్ని శాశ్వతంగా బాధలోకి నెట్టింది.
ఇది కూడా చదవండి: ఇంటి మెట్ల కింద ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు.. డబ్బుతోపాటు ఆ 6 సమస్యలు పరార్!