/rtv/media/media_files/2025/05/30/SrtSfS5HADPyIKoWsgqN.jpg)
Bengaluru man turns to stealing to support 3 wives and 9 kids
డబ్బులు సంపాదించడానికి ఒక్కొక్కరిది ఒక్కో తీరు. కొందరు ఫ్యామిలీ కోసం కష్టపడి డబ్బులు కూడబెడతారు. ఇంకొందరు ఈజీ మనీకి అలవాటు పడి ఏ పని చేయకుండా దొంగతనాలు చేసి దోచేస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి తన ఫ్యామిలీలను పోషించడానికి దొంగగా మారాడు. అతడికి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు ఫ్యామిలీలు ఉన్నాయి.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
ముగ్గురు భార్యలు, 9 మంది పిల్లలు
అంటే ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు భార్యలతో కలిగిన సంతానం దాదాపు 9 మంది. ఇక వారిని పోషించడానికి ఆ వ్యక్తికి తలప్రాణం తోకకు వచ్చినట్లైంది. మొదటిగా కూలి పనులు చేసుకునే వాడు. కానీ ఆ డబ్బులతో తమ మూడు ఫ్యామిలీలను పోషించడం కష్టంగా మారింది. దీంతో తరచూ ఏం చేయాలి? ఏం చేయాలి? అని తెగ ఆలోచించాడు.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
చివరికి ఈజీ మనీ సంపాదించే దుర్భుద్ది పుట్టింది. దీంతో దొంగగా మారాడు. పలు చోట్ల బంగారం, వెండి, నగదు.. ఇలా ఏవి దొరికితే అవి కొట్టేశాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇక నిందితుడి చోరీల వెనుకున్న కారణం తెలిసి పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల బాబా జాన్‌కు ముగ్గురు భార్యలు.. వారితో కలిగిన సంతానం 9 మంది. ఈ మూడు ఫ్యామిలీలను వేరే వేరే చోట ఉంచాడు. బెంగళూరు, చిక్కబళ్లాపుర, శ్రీరంగపట్టణాల్లో పెట్టి పోషించాడు. అది కష్టంగా మారడంతో జాన్ దొంగగా మారాడు. పలు ప్రాంతాల్లో దొంగతనం చేసి చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 188 గ్రాముల బంగారం, 550 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు
Follow Us