CRIME NEWS: డబుల్ యాక్షన్.. ఇద్దరిది ఒకటే పేర్లు, ఒకటే గ్రామం - కట్ చేస్తే!

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ఒకే పేరుతో నేరాలకు పాల్పడి అరెస్ట్ అయ్యారు. ఇద్దరి పేరు సుమిత్, ఒకటే గ్రామం, బాల్య స్నేహితులు. ఎన్నో నేరాలకు పాల్పడ్డారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ఇన్ఫార్మర్లను పెట్టి అరెస్టు చేశారు.

New Update
two childhood friends arrested

two childhood friends arrested

సాధారణంగా డబుల్ యాక్షన్ సన్నివేశాలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ బయట కూడా అలాంటి సంఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నేరస్థులు ఒకే పేరు పెట్టుకుని నేరాలకు పాల్పడ్డారు. వారిద్దరిదీ ఒకే గ్రామం. ఇద్దరూ బాల్యం నుంచి ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. కానీ వారి ప్రయాణం చివరికి నేరాలవైపుకు తీసుకెళ్లింది. వారిద్దరిపై ఎన్నో కేసులు ఉండటంతో పోలీసులు తాజాగా పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇద్దరూ ఒకే పేరుతో నేరాలు

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకుల పేరు సుమిత్. వీరిది దోఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంగల్ గ్రామం. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. కానీ వారి ప్రయాణం మంచి వైపుకు కాకుండా చెడు వైపుకు వెళ్లింది. కాల క్రమేణా నేరాల వీధులకు చేరుకుంది. 

ALSO READ: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా

హత్య, దోపిడీ నుండి చైన్ స్నాచింగ్ వరకు.. వారి నేరాల జాబితా చాలా పెద్దదిగా మారింది. ఇటీవల వీరిద్దరూ బరౌట్ పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఒక యువకుడి మొబైల్, రూ.10,000 దోచుకున్నారు. దీంతో అప్పటికే ఎన్నో కేసుల్లో చిక్కుకున్న వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాళ్లను పట్టుకునేందుకు ఏకంగా ఇన్పార్మర్లను ఏర్పాటు చేసారు. 

ALSO READ: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

ఇందులో భాగంగానే అందిన సమాచారం ప్రకారం.. బాగ్‌పత్‌లోని బినౌలి పోలీస్ స్టేషన్ మఖర్ కల్వర్ట్ వద్ద వారిని పట్టుకున్నారు. వారు బైక్ పై వస్తుండగా చుట్టుముట్టారు. దీంతో వారిద్దరూ పారిపోయే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసులు కాల్పులు జరిపారు. అందులో ఒక యువకుడి కాలుపై బులెట్ తగిలి కింద పడిపోయాడు. మరో యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని జైల్లో పెట్టారు.  

ALSO READ: ఈసారి ఆర్సీబీ కప్​ గెలుస్తుందా? చాట్​జీపీటీ ఆన్సర్‌‌కు ఫ్యాన్స్ అవాక్!

Advertisment
Advertisment
తాజా కథనాలు