Kurnool: మహానందిలో విషాదం.. శివ క్షేత్రంలో ఇద్దరు మృతి
శివ క్షేత్రమైన మహానందిలో విషాద ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల నుంచి ఉన్న నాగనంది సదనం కూల్చివేత ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. గదులు శిథిలం అయిపోవడంతో భక్తుల కోసం కొత్త వసతి గృహాలు నిర్మించారు. పాతవి కూల్చే సమయంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.