/rtv/media/media_files/2025/05/31/pznvS5BhpUSoGe9uj0aG.jpg)
Car driver blackmailed girl for money with nude videos in Vijayawada
ఈజీ మనీకి అలవాటు పడిన ఓ కారు డ్రైవర్.. అమ్మాయిను వలలో వేసుకుని.. వారి నుంచి న్యూడ్ వీడియోలు సేకరించాడు. వాటితో బ్లాక్ మెయిల్‌కు దిగి డబ్బులు గుంజేస్తున్నాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
మాయచేసి న్యూడ్ వీడియోలతో
విజయవాడకు చెందిన ఓ ఫ్యామిలీ మచిలీపట్నంలో ఉన్న బీచ్‌కు వెళ్లాలని గత ఏడాది సెప్టెంబర్‌లో కారు బుక్ చేసుకున్నారు. దీంతో కైకలూరుకు చెందిన కారు డ్రైవర్ రాజు.. వారిని బీచ్‌కు తీసుకెళ్లాడు. ఆ సమయంలోనే అక్క అంటూ కారులోని మహిలతో వరుస కలిపాడు. అక్కడితో ఆగకుండా అతడు.. బీచ్‌కు వెళ్లిన తర్వాత ఆ మహిళ కూతురితో మాటలు కలిపి.. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
అక్కడ నుంచి తరచూ ఆ బాలికతో ఫోన్‌లో మాట్లాడి ప్రేమ కురిపించాడు. చివరికి ప్రేమిస్తున్నానని ఆ బాలికను నమ్మించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి వీడియో కాల్ ద్వారా న్యూడ్ వీడియోస్ సేకరించాడు. అక్కడ నుంచి డ్రైవర్ రాజు తన ప్లాన్ ఫాలో అయ్యాడు. ఈ ఏడాది జనవరిలో ఆ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్‌కు దిగాడు.
‘మీ కూతురు నాకు న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపింది. అవి బయటకు రాకుండా ఉండాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడు. దీంతో తమ పరువు పోతుందని.. బాలిక తల్లిదండ్రులు విడతలవారీగా రూ.20 వేలు ట్రాన్సఫర్ చేశారు. అయితే అక్కడితో డ్రైవర్ రాజు ఆగలేదు. మళ్లీ ఈ నెల 2వ తేదీన బాలిక ఇంటికి వచ్చి.. తల్లిదండ్రులను బెదిరించి మరో రూ.50వేలు తీసుకున్నాడు.
Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?
అయినా అతడి ఆశ చావలేదు. మరో నాలుగు రోజుల తర్వాత ఇంకో రూ.50వేలు డిమాండి చేశాడు. దీంతో బాధితులు చేసేది ఏమీ లేక పటమట పోలీసులకు జరిగింది చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్ రాజుపై పోక్సో, ఐటీ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read: ట్రంప్ సాధించేశారు..సుంకాల విషయంలో అనుకూలంగా మరో కోర్టులో తీర్పు
 Follow Us
 Follow Us