/rtv/media/media_files/2025/06/01/g0rXY3P2tiTYMWF66dVE.jpg)
UP Aligarh Police Station Cook Raped Woman Made Obscene Video
కామంధుల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు ఎక్కడాలేని కామ కోరికలు పుట్టుకొస్తున్నాయి. తెలిసివారి వద్ద నమ్మకంగా ఉంటూ వేధించిన వారు కొందరైతే.. తెలియని మహిళ కనిపిస్తే కాటు వేసేద్దామని ఇంకొందరు. ఇలాంటి వారి వల్ల మహిళలు బయటకు ఒంటరిగా వెళ్లాలన్నా గజగజవణికిపోయే పరిస్థితి వచ్చింది.
Also Read: జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్ మెస్‌లో వంటవాడిగా పనిచేసే ఓ వ్యక్తి ఏకంగా అందులోనే ఓ మహిళపై రేప్ చేశాడు. అక్కడితో ఆగకుండా వీడియోలు, ఫొటోలు తీసి బయటపెడతానని బెదిరించి నాలుగు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఇక అతడి వేధింపులకు విసిగిపోయిన ఆ మహిళ చివరికి పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో
పోలీస్ స్టేషన్ మెస్‌లో రేప్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ పోలీస్‌స్టేషన్‌లోని మెస్‌లో ముకేశ్ అనే వ్యక్తి వంటవాడిగా పనిచేస్తున్నాడు. బాధితురాలికి పెళ్లై భర్త, పిల్లలు ఉన్నారు. ఆమె తరచూ పోలీస్ స్టేషన్ మెస్ సమీపంలోనే మేకలు మేపడానికి వెళ్తుంది. అయితే ఓ రోజు ఒక మేక కనిపించకపోవడంతో అనుకోకుండా ఆ మెస్ వైపు వెళ్లింది. ఆమెను ఒంటరిగా చూసిన వంటవాడు ముకేశ్ తనలోని కామ కోరికల్ని బయటకలాగాడు.
Also Read: గాంధీ, అబ్దుల్ కలాంతో మల్లారెడ్డి భేటి.. సంచలన వీడియో
మెస్‌లోనూ ఇతర సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ముకేష్ ఆ మహిళను లోపలకి తీసుకెళ్లి రేప్ చేశాడు. అదే సమయంలో ఫొటోలు, వీడియోలు కూడా తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీటన్నింటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో తన పరువు ఎక్కడపోతుందోనని ఆ మహిళ సైలెంట్‌గా ఉండిపోయింది. ఇదే అదునుగా భావించిన ముకేష్ దాదాపు నాలుగు నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు.
Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
ఇలాగే మే 22న రాత్రి గోడదూకి బాధితురాలి ఇంట్లోకి వెళ్లాడు. దీంతో ఆమె గట్టిగా అరవడంతో అక్కడ నుంచి పారిపోయాడు. మరోవైపు ఆమె అరుపులకు కుటుంబ సభ్యులు లేచి ఆమె వద్దకు వెళ్లారు. అనంతరం పారిపోయిన ముకేశ్.. తాను బెదిరించినట్లు గానే తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ముకేశ్ పై కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదుతో ముకేశ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కాంట్రాక్టు పోస్టు కూడా తొలగించారు.
crime news | rape | sexual-assault | Latest crime news
Follow Us