Abhaya Hastham : అభయహస్తం నిధుల విడుదల
గత కొన్నేండ్లుగా నిలిచిపోయిన అభయహస్తం నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. 2009 నుంచి 2016 వరకు ఈ పథకం కింద స్వయం సహాయక బృందాల మహిళలు జమ చేసిన మొత్తాన్ని తిరిగి మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సెర్ప్ ద్వారా జాబితాను రెడీ చేస్తున్నారు.