/rtv/media/media_files/2025/04/09/YuRhlwxcfbLABGv4PcuC.jpg)
స్వతంత్య్ర పోరాటంలో ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టినట్లే బీజేపీని ఓడించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ సబర్మతి ఆశ్రమంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌కు ఆయన హాజరైయ్యారు. మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని చీల్చాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా.. గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ బీజేపీ పని చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.
LIVE: CM Revanth Reddy's Speech at AICC Session | Ahmedabad | NyayPath https://t.co/JdoT6w4tou
— Revanth Reddy (@revanth_anumula) April 9, 2025
తెలంగాణలో కులగణన చేసినట్లే దేశావ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీని ఓడించడానికి దేశంలో ఉన్న గాంధేయవాదులంతా ఏకంకావాలని ఆయన సూచించారు. ఆయనతోపాటు రాష్ట్ర ముఖ్య నాయకులు కూడా ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నారు.
Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)