/rtv/media/media_files/erdRw4oYePvs6Jkg697U.jpg)
Mandi MP Kangana Ranuat
బాలీవుడ్ స్టార్, మండి ఎంపీ కంగనా రౌనత్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు వచ్చిందంటూ గోల చేసింది కంగనా. తప్పంతా కాంగ్రెస్ ప్రభుత్వందే అంటూ మండిపడింది. ఒక్క రోజు కూడా ఉండని ఇంటికి లక్ష బిల్లు ఎలా వస్తుంది అంటూ రచ్చరచ్చ చేసింది. ఇంకేముంది దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగడం మొదలైంది. అయితే వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ విద్యుత్ శాఖ క్లారిటీ ఇచ్చింది. కంగనా ఇంటికి వచ్చిన బిల్లు లక్ష కాదని రూ. 55 వేలు మాత్రమేనని చెప్పింది. అది కూడా ఆమె చాలా ఏళ్ళుగా బిల్లు కట్టలేదని మొత్తం వెరసి అంత అయిందని క్లియర్ గా లెక్కలు చూపించింది.
అంతా కాంగ్రెస్సే చేసింది..
మాట్లాడితే చాలు కాంగ్రెస్ మీద విరుచుకుపడిపోతుంది కంగనా రౌనత్. ఎక్కడ అవకాశం దొరుకుతుందా..వేసుకుందామని అని ఎదురు చూస్తుంటుంది. అలాంటి ఆమెకు హిమాచల్ ప్రదేశ్ లో తన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు దొరికింది. ఇంకేం ఇదే సందని..మీడియా ముందు కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగింది. తాను నివాసమే ఉండని ఇంటికి అంత బిల్లు ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించింది. దాంతో పాటూ హిమాచల్ ప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటని.. రాష్ట్ర ప్రజలందరూ తనతో కలిసి ఇలాంటి సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇది కాస్తా రాజకీయ చర్చకు కారణంగా మారింది.
లెక్కలు చూపించిన విద్యుత్ శాఖ..
దాంతో హిమాచల్ ప్రదేశ్ HPSEBL మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. ఆమెకు వచ్చిన బిల్లు లక్ష కాదని రూ.55 వేలేనని తేల్చారు. అయితే ఈ 55 వేల రూపాయలు కేవలం ఈ నెల బిల్లు మాత్రమేనని కానీ ఆమె గతంలో చెల్లించని బిల్లులు కూడా కలిపి రూ.91,100 గా పూర్తి బిల్లు వచ్చిందని చెప్పారు. చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే ఇంత మొత్తంలో బిల్లు వచ్చేది కాదని సందీప్ కుమార్ స్పష్టం చేశారు. అంతేకాకుండా 28 రోజుల్లోనే ఎంపీ కంగనా రనౌత్ దాదాపు 9 వేల యూనిట్ల విద్యుత్ వినియోగించారని...అందుకే ఒక్క నెల బిల్లు కూడా రూ. 55 వేలు వచ్చిందని అన్ని లెక్కలతో సహా చూపించారు. అలాగే తాము కంగనాకు రూ.700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు తెలిపారు.
#WATCH | Shimla, HP | Sandeep Kumar, Managing Director of the Himachal Pradesh State Electricity Board Limited (HPSEBL), says, "BJP MP Kangana Ranaut raised an issue that the electricity board has asked her to pay the electricity bill of Rs 1 lakh of her house. The bill is almost… pic.twitter.com/oBnZPl9OhU
— ANI (@ANI) April 10, 2025
today-latest-news-in-telugu | kangana-ranuat | power-bills | congress | himachal-pradesh
Also Read: Alahabad: అత్యాచారం చేయడానికి కారణం ఆమే..అలహాబాద్ హైకోర్టు మరో సంచలన తీర్పు